Bad Habits : ఈ 5 అల‌వాట్లు మీకు ఉన్నాయా.. అయితే వెంట‌నే మానేయండి.. లేదంటే అంతా ద‌రిద్ర‌మే..!

November 24, 2023 9:29 PM

Bad Habits : ప్రతి ఒక్కరు కూడా, ధనవంతుల అవ్వాలని అనుకుంటూ ఉంటారు. ఆర్థిక ఇబ్బందులు ఏమీ కలగకుండా, సంతోషంగా ఉండాలని అనుకుంటారు. ఈ ఐదు అలవాట్లని అలవాటు చేసుకుంటే, అంతా మంచి జరుగుతుంది. అనుకున్నవి జరుగుతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. దరిద్రం మీ నుండి దూరంగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా మంచి అలవాట్లు, చెడు అలవాట్లు రెండు ఉంటాయి. చెడు అలవాట్ల వలన మనకి ఇబ్బంది రావచ్చు. కొన్ని చెడు అలవాట్లు మనలో ఉంటాయి. వాటి నుండి దూరంగా ఉండకపోతే, ఎంతో నష్టం కలుగుతుంది.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, చిన్న చిన్న పొరపాట్లు పెద్ద దోషానికి దారితీస్తాయి. ఈ తప్పులు ఒకరికి అలవాటు అవ్వచ్చు. ఈ అలవాట్లు ఒక వ్యక్తిని పేదవాడిగా మార్చేయగలవు. మనిషిని పేదవాడిలా మార్చేసే అలవాట్లు ఏంటో ఇప్పుడే చూసేద్దాం. సాయంత్రం, రాత్రి సమయంలో అంటే సాయంత్రం 6 దాటాక గోళ్ళని కత్తిరించకూడదు, ఆ తప్పు చేయడం వలన దరిద్రం కలుగుతుంది. హిందూ విశ్వాసాల ప్రకారం, లక్ష్మీదేవి సాయంత్రం ఇంటికి వస్తుంది.

if you have these 5 Bad Habits then you will become poor
Bad Habits

అలాంటప్పుడు గోళ్ళని కత్తిరించడం వలన, సంపద తగ్గిపోతుంది. దరిద్రం కలుగుతుంది. రాత్రి పడుకునే ముందు, వంటగదిలో మురికి పాత్రలు శుభ్రం చేసుకుని మాత్రమే నిద్రపోవాలి. అలా వదిలేస్తే, లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది. మనం ఇంటి బయట పెట్టే చెప్పులు, బూట్లు ఎప్పుడు కూడా ఆర్డర్ లో ఉండాలి.

ఇష్టానుసారంగా వాటిని పారేస్తే, లక్ష్మీదేవికి కోపం వస్తుంది. ఆర్థిక భాదల్ని కలిగిస్తుంది. అదేవిధంగా, ఎప్పుడు నీటిని వృధా చేయకూడదు. నీటిని వృధా చేయడం వలన కూడా లక్ష్మీదేవి ఇంటి నుండి వెళ్ళిపోతుంది. చాలామంది సాయంత్రం పూట కానీ నచ్చినప్పుడు కానీ, ఇంటి ముఖద్వారం దగ్గర కూర్చుంటూ ఉంటారు. కానీ, వాస్తు ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం వద్ద కూర్చోవడం అశుభం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now