Kiran Abbavaram : కిర‌ణ్ అబ్బ‌వ‌రం రూటే స‌ప‌రేటు.. రెమ్యునరేష‌న్ తీసుకోకుండా సినిమాలు చేస్తున్నాడా..!

November 21, 2023 10:25 AM

Kiran Abbavaram : టాలీవుడ్ యంగ్ స్టార్ కిరణ్ అబ్బవరం పెద్ద‌గా స‌క్సెస్ లేక‌పోయిన మ‌నోడు తెలుగు ప్రేక్ష‌కుల‌కి చాలా సుప‌రిచితం. ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి వైవిధ్య‌మైన సినిమాల‌తో దూసుకు పోతున్నారు. ఈ ఏడాది మొత్తం మూడు సినిమాలను ఆడియన్స్ ముందుకు తీసుకు రాగా వీటిలో ‘వినరో భాగ్యము విష్ణు కథ’ మాత్రం ఓ మోస్త‌రుగా అల‌రించింది. కిరణ్ అబ్బవరం చివరగా రూల్స్ రంజన్ అంటూ వచ్చాడు. ఈ చిత్రం సైతం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేసింది. అలా కిరణ్ అబ్బవరంకు ఇప్పుడు కాస్త బ్యాడ్ టైం నడుస్తుంద‌నే చెప్పాలి. రానున్న రోజుల్లో కిరణ్ అబ్బవరం నుంచి ఓ పాన్ ఇండియా మూవీ వస్తుందనే టాక్ వినిపించింది.

ఇదిలా ఉంటే ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.. అషు రెడ్డిని హోస్టుగా పెట్టి కొత్త టాక్ షో ‘దావత్’ ని మొద‌లు పెట్టింది. ఈ టాక్ షోకి తొలి గెస్ట్‌గా యువ హీరో కిరణ్ అబ్బవరంని గెస్ట్ గా వ‌చ్చారు. ఈ ఇంటర్వ్యూలో కిరణ్ కి సంబంధించిన అనేక విషయాలను ఆడియన్స్ కి తెలియజేశారు అషు రెడ్డి. కాగా కిరణ్ అబ్బవరం తన నటించిన సినిమాలకు రెమ్యూనరేషన్ తీసుకోకుండా లాభాల్లో వాటాలు తీసుకుంటారని ఇండస్ట్రీలో టాక్ ఉంది. బడా స్టార్స్ మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ మాదిరిగానే తాను చేస్తున్నాడ‌ని టాక్ న‌డిచింది. ఈ క్ర‌మంలో కిర‌ణ్ అబ్బ‌వ‌రంకి దాని గురించి అషూ ప్ర‌శ్న వేసింది.

Kiran Abbavaram interesting comments on his remuneration
Kiran Abbavaram

దానిపై స్పందించిన కిర‌ణ్ అబ్బ‌వ‌రం ముందు ఎంతో కొంత తీసుకోవడం కంటే.. సినిమా అంతా అయ్యాక.. నిర్మాతకు పెట్టింది వచ్చాక.. లాభాలు వస్తే తీసుకుందామనుకుంటాను.. అందులో షేర్ తీసుకుంటాను.. ఒక వేళ సినిమా పోతే.. నిర్మాతకు ఏం రాకపోతే.. నేను కూడా ఏమీ తీసుకోను అంటూ ఎంతో నిజాయితీగా చెప్పుకొచ్చాడు. మీటర్, నేను మీకు బాగా కావాల్సిన వాడిని అనే చిత్రాలు పెద్ద ప్రొడక్షన్ సంస్థలు అని చేశారా? అంటూ అషూ అడిగింది. అవును అంటూ సమాధానం ఇచ్చాడు. ఒక వేళ మీరే నిర్మాతలు అయి ఉంటే ఆ సినిమాలు నిర్మించేవారా? అని మళ్లీ అడిగింది అషూ. నిర్మాతగా అయితే నిర్మించేవాడ్ని కాదని అంటాడు. ఇలా కిర‌ణ్ చెప్పిన వ్యాఖ్య‌లు ఇప్పుడు నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now