స్పోర్ట్స్ డ్రామాలో తరుణ్ భాస్కర్ సరి కొత్త సినిమా!

July 17, 2021 4:01 PM

విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన “పెళ్లిచూపులు”, విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన “ఈ నగరానికి ఏమైంది”వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు తరుణ్ భాస్కర్ సమర్పణలో తాజాగా మరో చిత్రం తెరకెక్కుతోంది. తరుణ్ భాస్కర్ సమర్పణలో క్రీడా నేపథ్యం ఉన్న ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో సాయి సుశాంత్ రెడ్డి హీరోగా సందడి చేయనున్నారు.

రోహిత్ తంజావూర్ దర్శకత్వంలో రాజు, ప్రమోద్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫీలర్ వీడియోను చిత్ర బృందం శుక్రవారం విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. ఎలైట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రొడక్షన్స్‌లో రూపొందుతున్న మూడవ చిత్రమిది.

యాక్షన్‌ ప్యాక్డ్‌ స్పోర్ట్స్‌ తరహాలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కె సిద్ధార్థ రెడ్డి కెమెరామెన్ గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ఫీలర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుని త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని ఈ సందర్భంగా చిత్ర బృందం తెలియజేశారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment