Catherine Tresa : కేథ‌రిన్ అందాల‌పై స్పాట్‌లైట్.. మ‌త్తెక్కిపోతున్న కుర్రకారు..

November 19, 2023 9:38 AM

Catherine Tresa : డాషింగ్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వం వహించిన ఇద్దరమ్మాయిలతో సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అందాల ముద్దుగుమ్మ కేథ‌రిన్ . అంతకు ముందు చమ్మక్ చల్లో అనే సినిమాలో నటించిన ఈ భామ‌కి పెద్ద‌గా గుర్తింపు ద‌క్క‌లేదు. కాని ఇద్దరమ్మాయిలు సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించినప్పటికీ కేథ‌రిన్ తన గ్లామర్ తో కట్టిపడేసి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ఈ సినిమా తర్వాత చిన్నదానికి వరుస ఆఫర్స్ వచ్చాయి. బొద్దుగా ఉంటూ గ్లామర్ లుక్ లో ప్రతి ఒక్కరిని ఆకర్షించే హీరోయిన్ కేథరిన్. అందం, నటన ఉన్నప్పటికీ కేథరిన్ స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకోలేకపోయింది.

చూస్తే స్టార్ హీరోయిన్ ఫీచర్స్ ఉన్నాయని అనిపించినా సరే కెరీర్ లో ఆమె ఎంచుకున్న సినిమాల వల్ల అమ్మడి కెరీర్ నత్త నడక నడిచింది. న్నడ సినిమా శంకర్ ఐపిఎస్ తో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన కేథరిన్ తెలుగులో వరుణ్ సందేశ్ తో చమ్మక్ చల్లో సినిమాతో వచ్చింది. ఆ సినిమా పెద్దగా క్రేజ్ తీసుకు రాలేకపోయినా అల్లు అర్జున్ తో చేసిన ఇద్దరమ్మాయిలతో సినిమా ఆమెను యూత్ ఆడియన్స్ కు దగ్గరయ్యేలా చేసింది. అల్లు అర్జున్ తో మూడు సినిమాల దాకా చేసిన అమ్మడు ఆ తర్వాత కూడా కెరీర్ ఆశించిన విధంగా మ‌ల‌చుకోలేపోయింది. చేసిన కొన్ని చిత్రాల‌లో కేథ‌రిన్ నిడివి కాస్త త‌క్కువ‌గా ఉండ‌డం వ‌ల‌న గ్రాఫ్ ప‌డిపోయిందని చెప్పాలి.

Catherine Tresa latest designer ware dress photos viral
Catherine Tresa

కేథ‌రిన్ గ‌త ఏడాది భళా తందనానా, బింబిసార సినిమాల్లో నటించిగా, ఈ సంవ‌త్స‌రం మాత్రం వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజ భార్యగా నటించింది. సినిమాలతో వచ్చే ఇమేజ్ కన్నా ఫోటో షూట్స్ తోనే ఎక్కువ క్రేజ్ తెచ్చుకోవాలని చూస్తున్నారు హీరోయిన్స్. వారిలో కేథరిన్ కూడా తన ఫోటో షూట్స్ తో ఆడియన్స్ ని అలరిస్తుంది. కేథరిన్ వెండి తెరపై ఎప్పుడూ హద్దులు దాటి అందాలు ప్రదర్శించలేదు. సహజ సిద్దంగానే కేథరిన్ తన గ్లామర్ లుక్స్ తో యువతని ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ భామ ఉక్కిరి బిక్కిరి చేసే ఎద సోయగాలతో రెచ్చిపోయింది. అంతే కాదు కుర్రాళ్ళని కాల్చేసే చూపులతో కసిగా చూస్తోంది. స‌రైన అవ‌కాశాలు లేని నేప‌థ్యంలో కేథ‌రిన్ సోషల్ మీడియాలో యువతని ఆకట్టుకునే విధంగా గ్లామర్ ఒలకబోస్తూ డైరెక్టర్స్, నిర్మాతల దృష్టిని త‌న‌వైపుకి తిప్పుకుంటుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now