Anasuya : డీప్ బ్లౌజ్‌లో అందాల అరాచ‌కం .. అన‌సూయ లుక్స్ చూసి కుర్ర‌కారు హృద‌యాలు గ‌ల్లంతు

November 17, 2023 7:46 PM

Anasuya : మాజీ జ‌బ‌ర్ధ‌స్త్ యాంక‌ర్ అన‌సూయ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ అమ్మ‌డు త‌న క్యూట్ మాట‌ల‌తో కాకుండా అందంతో అద‌ర‌హో అనిపిస్తుంటుంది. ఒక‌ప్పుడు యాంక‌ర్‌గా స‌త్తా చాటిన అన‌సూయ ఇప్పుడు న‌టిగా కొన‌సాగుతుంది. ‘రంగస్థలం’లో రంగమ్మత్తగా, ‘పుష్ప’ సినిమాలో కాత్యాయనిగా నటించి ఓ రేంజిలో గుర్తింపు తెచ్చుకుంది. చక్కటి పాత్ర లభిస్తే నటించేందుకు ఎప్పుడూ సిద్ధ‌మంటున్న అన‌సూయ రీసెంట్‌గా ‘విమానం’, ‘ప్రేమ విమానం’, ‘పెద్దకాపు’లాంటి సినిమాలతో ప్రేక్షకులను బాగా అలరించింది. ప్రస్తుతం ‘పుష్ప 2’ సహా పలు సినిమాల్లో నటిస్తోంది. సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పడు తన అందాల కనువిందుతో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. అన‌సూయ గ్లామ‌ర్ పిక్స్ ఎప్ప‌టిక‌ప్పుడు నెట్టింట తెగ సంద‌డి చేస్తూ ఉంటాయి.

అనసూయ తరచుగా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్, ఇతర ప్రకటనలతో బిజీగా ఉండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. అనసూయ తాజాగా ఓ షాపింగ్ మాల్ వాణిజ్య కార్యక్రమం కోసం రాయచోటి వెళ్లారు. దీనితో ఆ ప్రాంతం జనసంద్రంగా మారింది. ఈ షాపింగ్ మాల్ ఓపెనింగ్‌లో కెమెరాలకు ఫుల్‌గా పని చెప్పింది అనసూయ. చీరకట్టుతో మైమరపించిన అనసూయ.. ఆ చీరపై ధరించిన బ్లౌజ్‌పై అందరి దృష్టి వెళ్లేట్టు చేసింది. లోపల ధరించే బ్రా మాదిరిగా ఉన్న బ్లౌజ్‌తో వెరైటీ రవిక రవికను ధరించి అంద‌రి దృష్టి త‌న‌పై ప‌డేలా చేసింది. అన‌సూయ క్యూట్ లుక్స్ ప్ర‌తి ఒక్క‌రి మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది.

Anasuya launched a shopping mall in rayachoti
Anasuya

ఇక అనంతరం మీడియాతో మాట్లాడిన అనసూయ.. పుష్ప 2 సినిమా ముచ్చట్లను మీడియాతో పంచుకుంది. ‘‘పుష్ప 2 సినిమా కోసం టీం అంతా చాలా కష్టపడుతున్నాం.. అర్జున్ అర్జున్ గారు తగ్గేదేలే అన్నట్టుగా హార్డ్ వర్క్ చేస్తున్నారు. సుకుమార్ సార్ హై రేంజ్‌లో ఈ సినిమా తీస్తున్నారు. చిత్తూరు స్లాంగ్ మాట్లాడటం చాలా కష్టం. కానీ అల్లు అర్జున్ గారూ.. సుకుమార్ గారు అయితే టకటకా మాట్లాడేస్తారు. షెడ్యూల్ షెడ్యూల్‌కి ఇంప్రూవ్ అయిపోతున్నారు’ అంటూ పుష్ప సంగ‌తుల‌ని చెప్పుకొచ్చింది అన‌సూయ‌. ప్ర‌స్తుతం అన‌సూయ‌కి సంబంధించిన క్యూట్ పిక్స్ సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now