Mangalavaram Movie Review In Telugu : మంగ‌ళ‌వారం మూవీ రివ్యూ.. సినిమా హిట్టా, ఫ‌ట్టా..!

November 17, 2023 2:50 PM

Mangalavaram Movie Review In Telugu : ఆర్జీవీ శిష్యుడు అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వంలో పాయ‌ల్ రాజ్‌పుత్ క‌థానాయిక‌గా రూపొందిన చిత్రం మంగ‌ళ‌వారం. ఆర్ఎక్స్ 100 సినిమాతో అద‌ర‌గొట్టిన ద‌ర్శ‌కుడు మహా సముద్రం లాంటి ఓ సినిమాను తీయ‌డం ఎవ్వరూ ఊహించలేదు. ఇక చాలా రోజుల త‌ర్వాత పాయల్ రాజ్‌పుత్‌తో మంగళవారం అనే చిత్రాన్ని తీశాడు. ఈ మూవీ నవంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిత్ర క‌థ విష‌యానికి వ‌స్తే.. మహాలక్ష్మీపురం అనే గ్రామంలో ఈ కథ జరుగుతుంది. కథ అంతా కూడా 80, 90ల నేపథ్యంలో ఉండ‌గా, ఊర్లో రవి, శైలు (పాయల్ రాజ్‌పుత్)లు బాల్య స్నేహితులుగా ఉంటారు. అయితే రవి చిన్నతనంలో ఓ అగ్ని ప్ర‌మాదంలో మరణిస్తాడని అనుకుంటుంది శైలు. కొన్నేళ్ల తరువాత ఆ ఊర్లో ప్రతీ మంగళవారం కొన్ని చావులు సంభవిస్తుండ‌డం, ఆ స‌మ‌యంలో అక్రమ సంబంధాలు ఉన్న వ్యక్తుల పేర్లు ఊర్లోని గోడ మీద ప్ర‌త్య‌క్షం అవ‌డం జ‌రుగుతుంటుంది.

ఇక తెల్లారే ఇద్ద‌రు చ‌నిపోయి క‌నిపిస్తూ ఉంటారు. కొత్తగా వచ్చిన ఎస్సై మాయా (నందితా శ్వేత) మీద ఊరి జనాలు అనుమానపడతారు.. ఎస్సై మాయ ఏమో ఊర్లోని కొంత మంది వ్యక్తుల మీద అనుమానం వ్యక్తం చేస్తుంది. ఊరి పెద్ద జమిందారు ప్రకాశం బాబు (చైతన్య కృష్ణ), వాసు (శ్రవణ్ రెడ్డి), కసిరాజు (అజయ్ ఘోష్), గురజ (శ్రీ తేజ్), ఆర్ఎంపీ విశ్వనాథం (రవీంద్ర విజయ్)లాంటి కొంత మంది మీద అనుమానం వ్య‌క్తం అవుతుండ‌గా, అస‌లు ఈ చావులన్నంటి వెనకాలు ఉన్న కథ ఏంటి? శైలు జీవితంలోకి వచ్చిన మధన్ (అజ్మల్ అమీర్) వ్యవహారం ఏంటి? జమీందారు భార్య రాజేశ్వరీ దేవి పాత్ర ఏంటి? అన్నది థియేట‌ర్ లో చూడాల్సి ఉంది.

Mangalavaram Movie Review In Telugu
Mangalavaram Movie Review In Telugu

క‌థను భావోద్వేగంతో దర్శకుడు అజయ్ భూపతి ఆరంభించిన విధానం బాగుంది. ఆ తర్వాత గ్రామంలో ఉండే కొన్ని క్యారెక్టర్లను ప్రధానంగా చేసుకొని హీరో, హీరోయిన్లు లేకుండా ఫస్టాఫ్ వరకు కథను పరుగులు పెట్టించిన విధానమే సగం సక్సెస్‌కు కారణమని చెప్పవచ్చు. ఫస్టాఫ్‌లో జరిగే మరణాలు, వాటి చుట్టు సాగిన డ్రామాను డైరెక్టర్ రక్తి కట్టించారు. ప్రతీ క్యారెక్టర్‌పై అనుమానాలు వచ్చేగా రాసుకొన్న స్క్రిప్టు బాగుంది. శైలు పాత్రకు సంబంధించిన చిన్న ట్విస్టుతో ఫస్టాఫ్‌ను ముగించడంతోపాటు సెకండాఫ్‌పై భారీ అంచనాలు పెంచారు. శైలు పాత్రను స్క్రీన్‌పై బోల్డుగా చూపిస్తూనే ఆ క్యారెక్టర్‌పై సానుభూతిని పెరిగేలా చేయడం ఆయన దర్శకత్వ ప్రతిభకు అద్దం పట్టింది. చివరి 45 నిమిషాల్లో ప్రతీ ట్విస్టును విప్పిన విధానంతో సినిమాను సక్సెస్ ట్రాక్‌‌ను ఎక్కించడమే కాకుండా పరుగులు పెట్టేలా చేశాడని చెప్పవచ్చు.ఎవరూ ధైర్యం చేయని పాత్రను ఛాలెంజింగ్‌గా తీసుకొని పాయ‌ల్ అద‌ర‌గొట్టింది. స్క్రిప్ట్ పరంగా కొన్ని లోపాలు, లాజిక్‌కు దూరంగా ఉన్నా.. మేకింగ్, యాక్టర్ల ఫెర్ఫార్మెన్స్ వల్ల అవన్నీ కనిపించుకుండా పోయాయి.థ్రిల్లర్, సస్పెన్స్ జోనర్లను ఇష్టపడే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now