శకుంతలంలో అర్హ డైలాగ్స్‌పై సమంత కామెంట్స్.. స్నేహ రెడ్డి రిప్లై..

July 16, 2021 5:19 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో అల్లు కుటుంబానికి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికే మూడు తరాలు సినిమా ఇండస్ట్రీలో తనదైన గుర్తింపు సంపాదించుకున్నాయి.ఇక నాల్గవ తరం కూడా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిందని తాజాగా అల్లు అర్జున్ ఎమోషనల్ గా చేసిన పోస్ట్ మనందరికీ తెలిసిందే.

గుణశేఖర్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న “శాకుంతలం” సినిమా ద్వారా అల్లు అర్హ వెండితెర అరంగ్రేటం చేయనున్నారు.ఈ సినిమాలో అల్లు అర్హ శకుంతల కుమారుడు భరతుడి పాత్రలో సందడి చేయనున్నారు. ఇందులో తన పాత్ర గురించి సమంత తెలియజేశారు. ఇన్ని రోజులు షూటింగ్ వాయిదా పడి తిరిగి ప్రారంభమైన నేపథ్యంలో అల్లు అర్హ తాజాగా షూటింగ్లో పాల్గొన్నారు.

ఈ విధంగా అర్హ ఎంట్రీ పై సమంత సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.ఫస్ట్ టేక్ అయిపోయింది. అదరగొట్టేసింది. ఆమెకు రాసిన డైలాగ్స్ అన్నీ కూడా అదిరిపోతాయ్.. సూపర్‌గా ఉన్నాయంటూ సమంత చెబుతూ ఓ పోస్ట్ చేశారు. సమంత చేసిన ఈ పోస్ట్ పై అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి స్పందించారు. షాట్స్‌లో అర్హకు సాయం చేస్తూ తనని జాగ్రత్తగా చూసుకుంటునందుకు స్నేహరెడ్డి సమంతకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా సమంత పోస్ట్ పై బన్నీ స్పందిస్తూ… “థాంక్యూ సో మచ్” అని తెలిపారు. ఈ విధంగా అల్లు వారసురాలు శాకుంతలంలోకి అడుగు పెట్టడంతో, ఈ సినిమా ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండీగా మారిపోయింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment