బైక్ కొనాలనుకుంటున్నారా.. ఏకంగా రూ.25 వేల తగ్గింపు..

July 16, 2021 12:48 PM

మీరు కొత్తగా బైక్ కొనాలనుకుంటున్నారా..? అయితే మీకు ఇది శుభవార్త అని చెప్పవచ్చు. కొత్తగా బైక్ కొనాలనుకునే వారికి బజాజ్ మోటార్స్ అద్భుతమైన ఆఫర్ కల్పిస్తోంది. బజాజ్ కంపెనీ వినియోగదారులకు కేటీఎం 250 అడ్వెంచర్ బైక్ ధరను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఒకేసారి ఈ బండి ధరను రూ.25 వేల రూపాయలు తగ్గించినట్లు బజాజ్ పేర్కొంది.

కరోనా ప్రభావం కారణంగా అమ్మకాలు తగ్గి పోయిన నేపథ్యంలోనే అమ్మకాలను పెంచడానికి బజాజ్ ఈ విధంగా అద్భుతమైన ఆఫర్ ని ప్రకటించినట్లు తెలుస్తోంది.బజాజ్ కంపెనీ ప్రకటించిన ఈ తగ్గింపు ధరల ఆఫర్ కేవలం కొద్ది రోజుల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.ఆగస్ట్ నెల చివరి వరకు మాత్రమే ఈ తగ్గింపు ధరలు వర్తిస్తాయి.

కేటీఎం 250 అడ్వెంచర్ బైక్ ధరను 25 వేలకు తగ్గించగా ప్రస్తుతం ఈ బండి రూ.2.3 లక్షలకు అందుబాటులో ఉంది. ఈ బండి 250 సీసీ ఇంజిన్ ను కలిగి ఉంది.మరి ఇంకెందుకు ఆలస్యం వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, అద్భుతమైన అడ్వెంచర్ బైక్ ను సొంతం చేసుకోవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment