Kasthuri Shankar : బికిని ఫొటో పంపినందుకు చెల్లెలి పాత్ర ఇచ్చారంటూ క‌స్తూరి కామెంట్స్

November 16, 2023 3:34 PM

Kasthuri Shankar : సీనియర్ హీరోయిన్ కస్తూరి గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఇటీవ‌లి కాలంలో ఈ ముద్దుగుమ్మ ఎక్కువ‌గా వార్త‌ల‌లో నిలుస్తుంది. గ‌తంలో ఈ అమ్మ‌డు హాఫ్ న్యూడ్ బోల్డ్ పిక్ తో రచ్చ రచ్చ చేసింది. ఆ తర్వాత కొన్ని కాంట్రవర్సీ కామెంట్స్ కూడా చేసి న్యూస్ లో నిలిచింది. తాజాగా మరోసారి కస్తూరి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసి వార్త‌ల‌లో నిలిచింది. త‌న‌కి ఒక సినిమా కోసం బికినీ ఫొటోలు పంప‌గా, అప్పుడు చెల్లెలు పాత్ర ఇచ్చార‌ని క‌స్తూరి కామెంట్ చేసింది. మ‌నం విలువతో ప్యాషనేట్‌గా పని చేస్తాము. కాని కొన్ని సార్లు మ‌న‌కు కావ‌ల‌సింది దొర‌క‌దు అని క‌స్తూరి పేర్కొంది.

మ‌నకు ఏద‌న్నా మంచి రఓల్ ద‌క్కాలంటే ఎంతటి అదృష్టం ఉండాలో ఆ తర్వాత రోజుల్లో తనకు తెలిసిందట. మొదట ‘భారతీయుడు’ సినిమాలో మొదట తనని హీరోయిన్‌ పాత్ర కోసం సంప్రదించారట. ఎలాగైనా ఆ సినిమా హీరోయిన్‌ ఛాన్స్‌ మిస్‌ చేసుకోకూడదని తను బికినీలో తీయించుకున్న ఫోటోలు కూడా పంపించింద‌ట‌. అదే సమయంలో ‘రంగీలా’ చిత్రం రిలీజ్‌కి రెడీ అవుతుండడంతో అందరూ ఊర్మిళ గురించి ముచ్చ‌టించుకున్నారు. చివరికి ఊర్మిళని హీరోయిన్‌గా ఫైనల్‌ చేశారు. చివరికి ఆ సినిమాలో కమల్‌హాసన్‌ చెల్లెలి పాత్ర త‌న‌కి ద‌క్కింద‌ని క‌స్తూరి పేర్కొంది.

Kasthuri Shankar sensational comments about film industry
Kasthuri Shankar

ఒకప్పుడు సినిమా స్టార్‌గా పలు తెలుగు సినిమాల్లో నటించిన కస్తూరి ప్రస్తుతం సీరియళ్లలో బిజీ అయిపోయారు. తమిళంతో పాటు తెలుగులోనూ సీరియల్ చేస్తూ అల‌రిస్తుంది.. సినిమా, సీరియల్‌ షూటింగ్‌లతో ఎంత బిజీగా ఉన్నా.. సోషల్‌ మీడియాను మాత్రం హాట్ హాట్ అందాల‌తో కుర్రాళ్ల‌కి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. ఒక సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ భామ ఎప్ప‌టిక‌ప్పుడు తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ప్రజా సమస్యలపై కూడా తనదైన శైలిలో స్పందిస్తూ హాట్ టాపిక్‌గా మారుతూ ఉంటుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now