Latest Malayalam Movies On OTT : ఓటీటీలో సందడి చేయ‌నున్న మ‌ల‌యాళ సినిమాల లిస్ట్ చూస్తే మైండ్ బ్లాక్ అవుత‌ది..!

November 14, 2023 2:04 PM

Latest Malayalam Movies On OTT : ఇటీవ‌లి కాలంలో మ‌ల‌యాళ సినిమాల‌కి ప్రేక్ష‌కాద‌ర‌ణ మ‌రింత పెరుగుతుంది. చిన్న హీరోలు,సీనియ‌ర్ హీరోలు సైతం వైవిధ్య‌మైన సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్నారు. ఓటీటీ వ‌చ్చాక తెలుగు ప్రేక్షకులతో పాటు ఇత‌ర భాష‌లకి చెందిన సినీ ప్రియులు సైతం మ‌ల‌యాళ సినిమాల‌ని ఎక్కువ‌గా ఆద‌రిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఓటీటీలో ప్ర‌స్తుతం సందడి చేస్తున్న సినిమాల‌తో పాటు రానున్న సినిమాలేంట‌నేవి ఇప్పుడు చూద్దాం. సాధార‌ణంగా మ‌లయాళ సినిమాలు ఎక్కువ‌గా మనోరమ మ్యాక్స్ ,సోని లివ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్ల‌లో ప్ర‌సారం అవుతుంటాయి.

ముందుగా చూస్తే .. కన్నూరు స్క్వాడ్అనే చిత్రం మ‌మ్ముట్టి ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందింది.ఈ సినిమా వచ్చే శుక్రవారం (నవంబర్ 17) డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లోకి రాబోతోంది. ఇక కుక్క‌ల‌కి ఫీలింగ్ ఉంటాయనే కాన్సెప్ట్‌తో రూపొందిన వాల‌ట్టీ చిత్రం నవంబర్ 7 నుంచే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమ్ అవుతోంది. ఇక కాసర్‌గోల్డ్ అనే మ‌ల‌యాళ చిత్రం అక్టోబర్ 13 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోంది. బంగారం చోరీ చుట్టూ తిరిగే యాక్షన్ థ్రిల్లర్ మూవీగా చిత్రాన్ని రూపొందించారు. ఇక మ‌ల‌యాళ స్టార్ హీరో దుల్క‌ర్ సల్మాన్ న‌టించిన కింగ్ ఆఫ్ కొత్త సెప్టెంబర్ 29 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమ్ అవుతోంది. ఇందులో దుల్క‌ర్ మాస్ పాత్ర‌లో క‌నిపించాడు.

Latest Malayalam Movies On OTT
Latest Malayalam Movies On OTT

ఇక సోని లివ్‌లో పెళ్లి చేసుకునే జంట పడే ఇబ్బందుల‌తో రూపొందిన 18 ప్ల‌స్ చిత్రం సంద‌డి చేస్తుంది. ఫీల్‌గుడ్ మూవీగా ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అలరించింది. ఇక డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో నెయ్‌మార్ అనే మ‌ల‌యాళ చిత్రం ప్ర‌సారం అవుతుండ‌గా, ఇది మనషులు, జంతువుల మధ్య ఉండే బంధాన్ని చాటి చెప్పేదిగా రూపొందింది. ఇది కూడా ప్రేక్ష‌కుల‌ని ఎంతగానో అల‌రిస్తుంది. ఇక మాస్టర్‌పీస్ వెబ్ సిరీస్డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో అందుబాటులో ఉంది. ఇందులో నిత్యా మీన‌న్ ప్ర‌ధాన పాత్ర పోషించ‌గా, కామెడీ వెబ్ సిరీస్‌గా రూపొందింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now