Anushka Shetty : బాహుబ‌లి సినిమాలో న‌టించడం అనుష్క‌కి న‌చ్చ‌లేదా.. అస‌లు సంగ‌తేంటి..?

November 12, 2023 5:51 PM

Anushka Shetty : బాహుబ‌లి.. ఈ సినిమా పేరు చెబితే తెలుగు ప్రేక్షకులే కాదు త‌మిళ ప్రేక్షకులు సైతం మైమ‌ర‌చిపోతుంటారు. తెలుగు, తమిళంతో పాటు ప‌లు భాష‌ల‌లో రూపొంది మంచి విజ‌యం సాధించి ఎన్నో రికార్డులు సాధించిన బాహుబ‌లి చిత్రంలో అనుష్క‌.. ప్రభాస్ జోడిగా దేవసేన పాత్రలో కనిపించింది. ఇందులో మరోసారి తన అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. రుద్రమదేవిగా, భాగమతి.. దేవసేనగా తెలుగు సినీ ప్రియుల హృదయాలను దొచుకున్న అనుష్క.. వేద సినిమాలో సరోజ పాత్రలో సైతం అదరగొట్టేసింది. అయితే బాహుబ‌లి సినిమాతో అనుష్క‌కి మంచి క్రేజ్ దక్కింది. దేవ‌సేన పాత్ర‌లో అనుష్క త‌న అందంతో పాటు అభిన‌యంతో అద‌ర‌గొట్టింది.

అయితే చిత్రంలో కథ నచ్చి అనుష్క‌ సినిమాలో భాగం కాలేదు అంటూ తాజాగా రాజమౌళి ఒక ఇంటర్వ్యూ లో ఆస‌క్తిక‌ర విష‌యం తెలియ‌జేశారు.ఇదివరకే రాజమౌళి దర్శకత్వంలో అనుష్క రవితేజ హీరోగా నటించిన విక్రమార్కుడు చిత్రం మంచి హిట్ కావ‌డంతో ఈ సినిమాతో అనుష్క‌కి మంచి పేరు వ‌చ్చింది. అయితే బాహుబ‌లి కథ ఏంటి అనే విషయం కూడా తాను వివరించలేదు అసలు రెమ్యూనరేషన్ ఎంత అని కూడా తాను ఏమీ మాట్లాడలేదు కానీ అనుష్క మాత్రం ఈ సినిమాలో భాగమయ్యారు.ఇలా కథ రెమ్యూనరేషన్ ఏవి మాట్లాడకుండా అనుష్క ఈ సినిమాలో నటించడానికి కారణం మరేది లేదు అంటూ రాజ‌మౌళి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

Anushka Shetty did not like acting in baahubali movie
Anushka Shetty

ప్రభాస్ రానా, రమ, వల్లి కీరవాణి గారు వీళ్లంతా సినిమా చేయ‌గా, ఆ స‌మ‌యంలో చిత్ర షూటింగ్ ఒక వెకేషన్ లాగ ఉంటుందని వారందరితో గడపడం చాలా సరదాగా ఉంటుంది ఇలాంటి అవకాశాన్ని తాను ఎందుకు మిస్ చేసుకుంటాను అన్న ఉద్దేశంతోనే అనుష్క ఈ సినిమాలో నటించింది అంటూ రాజమౌళి తెలిపారు. ఏది ఏమైనా ప్రభాస్ అనుష్క ఇలా బాహుబలి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now