Keerthy Suresh : నాగ చైత‌న్య భార్య ప్లేస్‌లో స‌మంత బ‌దులు కీర్తి సురేష్ రావ‌ల్సిందా..?

November 12, 2023 1:47 PM

Keerthy Suresh : అక్కినేని నాగార్జున ముద్దుల త‌న‌యుడు నాగ చైత‌న్య త‌న కెరీర్‌లో వైవిధ్య‌మైన సినిమాలు చేస్తూ అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ ద‌క్కించుకుంటున్నాడు. అయితే స‌మంత‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగ చైత‌న్య కొన్ని సంవ‌త్స‌రాల‌కే ఆమెకి విడాకులు ఇచ్చారు. హీరో నాగచైతన్య, హీరోయిన్ సమంతల బంధం గురించి అందరికి తెలిసిన విషయమే. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట.. కొన్ని సంవత్సరాలకే విడాకులు తీసుకోవడం జరిగింది. తెలుగు ఇండస్ట్రీలో సమంత -నాగచైతన్య జంట బెస్ట్ పెయిర్‌గా నిలుస్తుందని అందరు భావించారు.

కాని కొన్ని రోజులకి ఇద్ద‌రి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకుని ఎవరి జీవితాన్ని వారు కొనసాగిస్తున్నారు. అయితే విడాకుల విషయంలో అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి.. సమంతది తప్పంటే.. లేదు నాగచైతన్యదే తప్పని సోషల్ మీడియా వేదికగా యుద్దం చేశారు.విడాకులపై నాగచైతన్య ఎప్పుడు మాట్లాడింది లేదు. కాని సమంత మాత్రం తన సినిమాల విడుదల సమయంలో పరొక్షంగా విడాకులపై స్పందిస్తూ వస్తున్నారు.అయితే ప్ర‌స్తుతం నాగ చైత‌న్య‌కి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైర‌ల్ అవుతుంది. అంతా బాగుంటే స‌మంత ప్లేస్‌లో కీర్తి సురేష్ ఉండేదని కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ విష‌యం నెట్టింట వైర‌ల్ అయింది.

naga chaitanya first choice for marriage is Keerthy Suresh
Keerthy Suresh

వివ‌రాల‌లోకి వెళితే నాగ చైత‌న్య, స‌మంత కాంబినేష‌న్‌లో విడుద‌లైన మ‌జిలీ చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. శివనిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాల్లో మొదటగా హీరోయిన్ రోల్ కోసం సమంత కంటే ముందు వేరే హీరోయిన్స్ ని చూస్ చేసుకున్నారట. కీర్తి సురేష్ బాగుంటుంద‌ని మొద‌ట ద‌ర్శ‌కుడు భావించ‌గా, కీర్తి సురేష్ కన్నా ఆ పాత్రకు సమంతనే బాగుంటుందని ద‌ర్శ‌కుడికి చెప్ప‌డంతో ఆయ‌న స‌మంత‌ని తీసుకున్నార‌ట‌. సినిమా చూశాక కీర్తి సురేష్ క‌న్నా స‌మంత‌నే బాగానే సెట్ అయింద‌ని సినిమా చూసిన వాళ్లు అని అంటున్నారు. ప్ర‌స్తుతం ఈ వార్త నెట్టింట వైర‌ల్ అవుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now