వామ్మో.. ఈ కుర్రాడికి 82 దంతాలు.. కారణం ఏమిటంటే?

July 13, 2021 8:25 PM

సాధారణంగా ప్రతి మనిషికి 32 దంతాలు ఉంటాయి అనే విషయం మనకు తెలిసిందే.కానీ బీహార్ కి చెందిన ఓ కుర్రాడికి మాత్రం నోరంతా దంతాలు కలిగి ఉండి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. ఈ కుర్రాడికి 32 దంతాలకు బదులుగా ఏకంగా 82 దంతాలు ఉండడంతో ఈ విషయం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.బీహార్‌లోని పాట్నాలో నివసిస్తున్న 17 ఏళ్ల టీనేజర్ నితీష్ కుమార్ ఒక అరుదైన సమస్యతో బాధ పడటం వల్లే దంతాలు అధికంగా ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు.

ఈ విధంగా దంతాలు ఎక్కువగా రావటాన్ని వైద్యపరిభాషలో ‘ఓడోంటోమా’ అని పిలుస్తారని వైద్యులు చెబుతున్నారు. ఈ విధంగా నోటి నిండా పళ్ళు ఉండటంతో ఆ కుర్రాడికి మాట్లాడటానికి నోరు మెదప డానికి తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని అదేవిధంగా గొంతు నొప్పితో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు.

ఈ విధంగా నితీష్ కుమార్ కి పుట్టుకతో ఇన్ని పళ్ళు రాలేదని, గత ఐదు సంవత్సరాల నుంచి నోటిలో కణతులు ఏర్పడి వాటి నుంచి దంతాలు వచ్చాయని తెలిపారు.అయితే ఆర్థిక ఇబ్బందులు వల్ల ఇన్ని రోజులు చికిత్స చేయించుకోలేదని ప్రస్తుతం నొప్పి అధికమవడంతో నితీష్ ఇందిరా గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో వైద్యులను సంప్రదించాడు. ఇతని సమస్య చూసిన వైద్యులు సైతం ఎంతో ఆశ్చర్యానికి గురి అయినట్లు తెలిపారు.ఈ క్రమంలోనే వైద్యులు అతనికి సుమారు మూడు గంటల పాటు చికిత్స చేసి దంతాలను తొలగించినట్లు వైద్యులు తెలిపారు. ఇతడి నోటిలో ఏర్పడిన దంతాలకు సంబంధించిన ఎక్స్‌రే చిత్రాలను ఈ కింద‌ చూడగలరు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment