Anjeer రక్తహీనతను తగ్గించే అంజీర్ పండ్లు.. ఇంకా ఎన్నో ప్రయోజ‌నాలు క‌లుగుతాయి..!

May 23, 2023 10:07 AM

Anjeer : అంజీర్ పండ్లు మ‌న‌కు డ్రై ఫ్రూట్స్ రూపంలో, సాధార‌ణ పండ్ల రూపంలోనూ ల‌భిస్తాయి. వీటిని తినేందుకు కొంద‌రు ఇష్ట‌ప‌డ‌రు. కానీ ఈ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Anjeer health benefits take daily one
Anjeer

1. ఈ పండ్ల‌లో పీచు అధికంగా లభిస్తుంది. అరుగుదలకు మేలు చేస్తుంది. జీర్ణవ్యవస్థ పని తీరును మెరుగు పరుస్తుంది. దీంతో మలబద్దకం త‌గ్గుతుంది. చిన్నారులకు వీటిని రెండు పూటలా తినిపించడం మంచిది.

2. హైబీపీని అదుపు చేయడానికి అంజీర్‌ను తినాలి. ఇందులో ఉండే పొటాషియం అధిక రక్త పోటును అదుపులో ఉంచుతుంది.

3. మహిళల్లో రక్తహీనత సమస్య ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారు రోజూ అంజీర్‌ను తీసుకోవడం మంచిది. ఇందులో హిమోగ్లోబిన్ స్థాయుల్ని పెంచే పోషకాలు అధికంగా ఉంటాయి. దీంతో రక్తహీనత త‌గ్గుతుంది.

4. బరువు తగ్గాలనుకునేవారు దీన్ని తినాలి. కొన్ని ముక్కల్ని భోజనానికి ముందు తీసుకోవడం వల్ల పొట్ట త్వరగా నిండిపోతుంది. అతిగా తినే సమస్య తగ్గుతుంది. కొలెస్ట్రాల్ సమస్య ఉండదు.

5. హృద్రోగాలతో బాధపడేవారు ప్రతిరోజూ తీసుకునే ఆహారంలో అంజీర్‌ను చేర్చుకుంటే మేలు. ఇందులో పెక్టిన్ అనే పదార్ధం శరీరంలోని వ్యర్థాలను తొలగిస్తుంది. గుండెకు మేలుచేస్తుంది.

6. సంతానం కోరుకునేవారు అంజీర్‌ను ఎంత తీసుకుంటే అంత మంచిది. దీనిలో అధికంగా ఉండే మెగ్నీషియం, మాంగనీస్‌, జింక్‌ సంతాన సాఫల్యత పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment