కొంగలు నీటిలో ఎందుకు నిలబడతాయో తెలుసా ?

July 12, 2021 8:29 PM

ఒకప్పుడు కొన్ని వందల రకాల జాతుల కొంగలు ఉండేవి. కానీ క్రమంగా అంతరించిపోయి ఇప్పుడు 15 జాతులు మాత్రమే మిగిలాయి. వీటికి ఇవే తినాలన్న నియం ఏమీ ఉండదు. ఎప్పుడు ఏది దొరికితే అది తినేసి కడుపు నింపుకుంటాయి. చేపలు, పురుగులు, పండ్లు, గింజలు, మొక్కలు.. ఏవైనా సరే.. తింటాయి.

do you know why cranes stand in water

ఇవి మూడు నుంచి ఐదేళ్ల వయస్సు వచ్చే వరకు జత కట్టవు. ఒక్కసారి జత కట్టాక జీవితాంతం దానితోనే ఉంటాయి. అది చనిపోయినా సరే మరో దానికి దగ్గర కావు. కొంగలలో ఐకమత్యం చాలా ఎక్కువ. ఒక కొంగకి ఏదైనా ప్రమాదం వాటిల్లితే అది ఒక రకమైన శబ్దం చేస్తుంది. ఈ శబ్దం దాదాపుగా రెండు కిలోమీటర్ల వరకు వినిపిస్తుంది. దాన్ని గుర్తు పట్టిన ఇతర కొంగలన్నీ వచ్చేస్తాయి. కలసికట్టుగా శత్రువుతో పోరాటం చేస్తాయి.

కొంగలు గంటల పాటు చల్లని నీటిలో నిలబడి ఉంటాయి. శరీర ఉష్ణోగ్రతను సమన్వయం చేసుకోవడానికి ఇవి రక్తప్రసరణ వేగాన్ని నియంత్రించుకునే ప్రయత్నం చేస్తుంటాయి. అందుకోసం కాళ్లలో ఉండే రక్తనాళాలను బిగబడతాయి. దానికోసమే గడ్డ కట్టించేంత చల్లని నీటిలో గంటల సేపు నిలబడుతాయి.

వీటికి కాళ్లు చాలా బలంగా ఉంటాయి. శత్రువులు దాడి చేసినప్పుడు తమ కాళ్లతోనే ప్రతిఘటిస్తాయి. కొంగలు ప్రపంచమంతా ఉన్నాయి. కానీ అంటార్కిటికా, దక్షిణ అమెరికాల్లో మాత్రం ఎక్కడా ఒక్క కొంగ కూడా కనిపించదు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment