Cow : ఆవు తోక నుంచి ఒక వెంట్రుక‌ని తీసుకుని ఇలా చేయండి.. ఏం జ‌రుగుతుందో చూడండి..!

September 4, 2023 10:13 AM

Cow : మ‌నం ఆవుని పూజిస్తూ ఉంటాము. ఆవు ఎక్కడ కనిపించినా కూడా ఏదో ఒక ఆహార పదార్థాన్ని పెడుతూ ఉంటాము. హిందూ సంప్రదాయంలో గోవుకు ప్రత్యేక స్థానం ఉంది. గోవు తోకని, గంగడోలుని నిమురుతుంటాము. గోవు పొట్టకి, నుదుటికీ పసుపు, కుంకుమలను పెట్టి నమస్కరించుకుంటూ ఉంటాము. ఇంటి ముందుకి ఆవు వస్తే, ఇంటి ఆడపడుచు వచ్చినట్లుగా భావిస్తాము. ఏదో ఒకటి పెట్టి ఆ తర్వాత పంపిస్తాము. అన్ని జీవరాశుల్లో కల్లా తల్లితో సమానంగా ఈ భూమిపై పూజలు అందుకుంటుంది గోమాత. అయితే, గోమాత ఎక్కడ కనపడినా ఆవు తోకనుండి ఒక వెంట్రుక తీసుకోవాలి.

ఎందుకంటే, అది ఎంతో శక్తివంతమైనది. ఆవు తోక నుండి వెంట్రుక తీసుకుని బొటనవేలికి చుట్టుకోవాలి. ఎక్కడైనా ఒంట్లో నొప్పులు కానీ ఏమైనా బాధ కానీ ఉన్నట్లయితే, ఆ వెంట్రుక కట్టిన వేలుతో గట్టిగా ఒత్తుకోవాలి. మూడు సార్లు మనం ఇలా చేస్తే నొప్పి తగ్గిపోతుంది. నొప్పి వెంటనే తగ్గక పోతే, రెండు మూడు రోజులు ఇలా రిపీట్ చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వలన ఏ నొప్పి అయినా సరే తగ్గిపోతుంది.

take one hair from cow tail and do like this see what happens
Cow

ఈ వెంట్రుకలలో ఎంతో గొప్ప ఎనర్జీ ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీని ని బయటికి పంపించి, పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. ఎప్పుడైనా మీరు ఏ స్వామీజీ దగ్గరికి అయినా వెళ్ళినప్పుడు, వాళ్ళు ఒక కర్రతో మనల్ని దీవిస్తూ ఉంటారు. వాటికి ఆవు తోకకి సంబంధించిన వెంట్రుకలు ఉంటాయి.

ఈ వెంట్రుకల వలనే మనకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఏదో తెలియని శక్తి వస్తుంది. ఇంట్లో ఎవరికైనా దిష్టి తగిలితే, ఆవుతోక లోని వెంట్రుకలని, కొంచెం కుంకుమను కాగితంలో కలిపి చుట్టేసి మెడలో కనుక వేసుకుంటే, దిష్టి అనేది తగలదు. గోవు తోక భాగంలో లక్ష్మీదేవి ఉంటుందట. అలానే, గోవు కొమ్ముల నుండి పాదాల‌ దాకా దేవతలు, త్రిమూర్తులు ఉంటారు.

cow

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment