ఆల‌యంలో ప్ర‌ద‌క్షిణ స‌మ‌యంలో.. గ‌ర్భ‌గుడి వెనుక భాగాన్ని తాక‌కూడ‌దు.. ఎందుకంటే..?

September 3, 2023 2:35 PM

కాసేపు మనం ఆలయానికి వెళ్లి అక్కడ కూర్చుంటే, ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. చాలా మంది ఆలయాలకి వీలు కుదిరినప్పుడల్లా వెళ్తూ వుంటారు. పండగ సమయంలో, జాతర వేళలో అయితే చాలామంది భక్తులు ఆలయాలకి వెళ్తుంటారు. ఆలయానికి వెళ్ళినప్పుడు, మనం దేవుని దర్శించుకోవడానికి ముందు ప్రదక్షిణలు చేస్తూ ఉంటాము. గుడి చుట్టూ తిరుగుతూ మూడుసార్లు లేదంటే ఐదు సార్లు ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. అయితే, ప్రదక్షిణలు చేయడానికి వెళుతున్నప్పుడు, దేవాలయం వెనుక భాగాన్ని ముట్టుకోకూడదు.

కానీ, చాలామంది తెలియక పొరపాటు చేస్తూ ఉంటారు. అయితే, ఎందుకు ఆలయ వెనుక భాగాన్ని ముట్టుకోకూడదు..? దాని వెనుక కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. తెలియక చాలామంది ఆలయానికి వెళ్ళినప్పుడు, కొన్ని పొరపాట్లు చేస్తారు. కానీ, ఖచ్చితంగా ఈ నియమాలని పాటించాలి. పొరపాట్లు చేయకుండా ఉంటే, దేవుని అనుగ్రహం కలుగుతుంది. ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయి.

we should not touch Garbha Gudi back side

ఏ పని మొదలుపెట్టిన విజయం సాధించాలని మనం కోరుకుంటాం. భగవంతుడి ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ.. ఆలయంకి వెళ్లి దర్శనం అయిన తర్వాత మన వెన్ను దేవుడికి చూపించకుండా, తిరిగి అలానే వెనక్కి వచ్చేస్తూ ఉంటాము. దేవాలయాన్ని తాకుతూ ప్రదక్షిణలు చేయకూడదు. గుడిలోని వెనుక భాగంలో రాక్షసులు ఉంటారని అంటారు.

అలా చేయడం వలన రాక్షసులని నిద్రలేపినట్లు అవుతుందట. గుడికి వెళ్లి, దేవుడిని ఈ విధంగా మీరు ప్రార్థిస్తే, క‌చ్చితంగా నెగిటివ్ ప్రభావం మీ పై పడుతుంద‌ని పండితులు అంటున్నారు. కాబట్టి, వెనుక వైపు తాకకండి. ప్రదక్షణ సమయంలో గుడిని తాకుతూ ప్రదక్షిణలు చేయొద్దు. అదే విధంగా మనం ఆలయానికి వెళ్ళాక, దర్శనమైన వెంటనే తిరిగి వచ్చేయకూడదు. ఒకసారి ఆలయంలో ఎక్కడైనా కూర్చుని, ఆ తర్వాత రావాలి. ఆలయానికి వెళ్ళిన తర్వాత తీర్థం తాగి, తీర్థం తీసుకున్న చెయ్యిని తలకి రాసుకోకూడదు. ఇలా కొన్ని నియమాలు ఉన్నాయి. వీటిని పాటిస్తే, అంతా మంచే జరుగుతుంది. తప్పులు చేయడం వలన పాపం వస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment