అమెజాన్ క‌స్ట‌మ‌ర్ల‌కు శుభ‌వార్త‌.. భారీ త‌గ్గింపు ధ‌ర‌ల‌కు వ‌స్తువులు.. సేల్‌కి రెడీ అయిపొండి..!

July 9, 2021 4:52 PM

ఈ-కామ‌ర్స్ సంస్థ అమెజాన్ త‌న క‌స్ట‌మ‌ర్ల‌కు శుభ‌వార్త చెప్పింది. ఈ నెల 26, 27 తేదీల్లో ప్రైమ్ డే 2021 సేల్‌ను నిర్వ‌హిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ సేల్ కేవ‌లం అమెజాన్ ప్రైమ్ మెంబ‌ర్ల‌కు మాత్ర‌మే అందుబాటులో ఉంటుంది. ఇందులో భాగంగా స్మార్ట్ ఫోన్లు, క‌న్‌జ్యూమ‌ర్ ఎల‌క్ట్రానిక్స్‌, టీవీలు, అప్ల‌యెన్సెస్‌, అమెజాన్ డివైస్‌లు, ష్యాష‌న్ మ‌రియు బ్యూటీ ఉత్ప‌త్తులు, హోమ్ ఇంప్రూవ్‌మెంట్ మ‌రియు నిత్యావ‌స‌రాలు త‌దిత‌రాల‌ను భారీ త‌గ్గింపు ధ‌ర‌ల‌కు కొనుగోలు చేయ‌వ‌చ్చు.

amazon prime day sale offers huge discounts

సేల్ కొనసాగే 48 గంట‌ల పాటు క‌స్ట‌మ‌ర్ల‌కు ప‌లు డీల్స్ ల‌భిస్తాయి. సేల్‌లో భాగంగా మొబైల్స్‌, యాక్స‌స‌రీల‌పై 40 శాతం వ‌ర‌కు, ఎల‌క్ట్రానిక్స్ అండ్ యాక్స‌స‌రీస్‌పై 60 శాతం, టీవీలు, అప్లయెన్సెస్‌పై 65 శాతం వ‌ర‌కు త‌గ్గింపు ధ‌ర‌ల‌ను పొంద‌వ‌చ్చు.

అమెజాన్ ఎకో, ఫైర్ టీవీ, కిండిల్ డివైస్‌ల‌పై 50 శాతం వ‌ర‌కు త‌గ్గింపు ధ‌ర‌ల‌ను పొంద‌వ‌చ్చు. వ‌న్‌ప్ల‌స్‌, శాంసంగ్‌, షియోమీ, ఇంటెల్‌, ఐఎఫ్‌బీ, ఎల్‌జీ, ఏఎండీ, బోట్‌, నాయిస్‌, టెక్నో కంపెనీల‌కు చెందిన ఉత్ప‌త్తుల‌పై డిస్కౌంట్ల‌ను అందిస్తారు. హెచ్‌డీఎఫ్‌సీ కార్డుల‌తో వ‌స్తువుల‌ను కొంటే మ‌రో 10 శాతం అద‌న‌పు డిస్కౌంట్‌ను అందిస్తారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment