Kushmanda Deeparadhana : కూష్మాండ దీపారాధ‌న ఇలా చేయాలి.. వాస్తు దోషం, శ‌త్రు పీడ పోతాయి..!

August 29, 2023 8:20 AM

Kushmanda Deeparadhana : చాలామంది అనేక సమస్యలతో బాధపడుతూ ఉంటారు. వాటికి పరిష్కారం కోసం కూడా చూస్తూ ఉంటారు. గ్రహ దోషం, రుణ దోషం, శత్రు దోషం, వాస్తు దోషం ఇలా చాలామందికి ఎన్నో సమస్యలు ఉంటాయి. అయితే, అటువంటి వాళ్ళు బుడద గుమ్మడికాయతో దీపారాధన చేస్తే చక్కటి ఫలితం ఉంటుంది, ఇటువంటి దోషాలు అన్నీ కూడా పోతాయి. మరి ఇక ఇటువంటి దోషాలు పోవాలంటే ఏం చేయాలి, వాటి పరిహారాల గురించి చూద్దాం. పౌర్ణమి వెళ్లిన తర్వాత వచ్చే అష్టమిని బహుళ అష్టమి అని పిలుస్తారు. కృష్ణాష్టమి, కాలాష్టమి అని కూడా అంటారు.

కాలభైరవ స్వామికి ఈ అష్టమి చాలా ఇష్టం. అందుకని కాలభైరవ స్వామికి కూష్మాండ దీపారాధన చేస్తే మంచిది. ముందు దీపం ఎలా పెడతారో చూద్దాం. గుడికి వెళ్లి ఇది చేయకూడదు. ఇంట్లో మాత్రమే చేసుకోవాలి. దృష్టి దోషం, నరఘోష, ఆర్థిక సమస్యలు, ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ బాగా ఉండటం, లేదంటే పిల్లలు మాట వినకపోవడం వంటి సమస్యలు ఉన్నట్లయితే మంచి పరిహారం. ఎవరైతే దీపారాధన చేయాలనుకుంటున్నారో వాళ్లు బూడిద గుమ్మడికాయని మధ్యకి కొయ్యాలి. ఆ తర్వాత అందులోని గుజ్జుని తీసేసి, దానికి పసుపు కుంకుమ పెట్టాలి.

Kushmanda Deeparadhana do like this for many benefits
Kushmanda Deeparadhana

నువ్వుల నూనె పోసి పత్తితో కానీ గుడ్డతో కానీ వత్తి వేసి వెలిగించాలి. దాని కింద ఇత్తడి పళ్లెం పెట్టాలి. దీపారాధన ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళే ఇవన్నీ కూడా చేయాలి. ఆ తర్వాత వెలిగించిన బూడిద గుమ్మడి కాయకి నమస్కరించుకుని ముందు తల్లికి, తండ్రికి, గురువుకి, కుల దైవానికి, గ్రామదేవతకి, చండీమాతకి అలాగే ఆఖరిగా కాలభైరవ స్వామికి నమస్కారం చెప్పుకొని అప్పుడు ఇలా చెప్పుకోండి. నేను కూష్మాండ దీపారాధన చేస్తున్నాను జీవితంలో ఎదుర‌య్యే కష్టాలు, నష్టాలు తొలగించి, సంతోషం, సౌభాగ్యం కావాలని కోరండి.

తర్వాత పంచోపచార పూజా చేసి అగరవత్తులు వెలిగించాలి. దీనిని గుమ్మడికాయకి గుచ్చండి. కాలభైరవ నామావళి లేదంటే అష్టకం చదువుకోవాలి. ఎవరైనా సరే ఈ పూజ చేసుకోవచ్చు. ధన యోగం కోసం అష్టమి నాడు, జనాకర్షణ కోసం అమావాస్యనాడు చేసుకోవాలి. ఈ దీపారాధన 19 అష్టమి తిథుల్లో కానీ 19 అమావాస్య తిథుల్లో కానీ చేస్తే మంచిది. పూజ అంతా అయిపోయాక ఎండు ఖర్జూర‌ల‌ని ప్రసాదంగా నైవేద్యం పెట్టాలి. పూజ చేసిన నాడు ఉపవాసం ఉండాలి. ద్రవ పదార్థాలను తీసుకోవచ్చు. ఉదయం 4:30 నుండి 6 మధ్యలో చేసేయాలి. భక్తిశ్రద్ధలతో ఈ పూజ చేస్తే పూర్తి నరదృష్టి, గ్రహవాస్తు పీడలు తొలగిపోతాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment