కుమార్తె ఫొటోల‌ను రివీల్ చేసిన హ‌రితేజ‌.. చిన్నారి ఎలా ఉందో చూశారా ?

July 9, 2021 2:07 PM

న‌టి, యాంక‌ర్ హ‌రితేజ ఇటీవ‌లే ఓ ఆడ శిశువుకు జ‌న్మ‌నిచ్చిన విష‌యం విదిత‌మే. సోష‌ల్ మీడియాలోనూ హ‌రితేజ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. త‌న విష‌యాల‌ను సోష‌ల్ ఖాతాల్లో షేర్ చేస్తుంటుంది. ఇక త‌న కుమార్తె ఫొటోల‌ను కూడా ఆమె అభిమానుల‌తో పంచుకుంది. ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో త‌న కుమార్తె ఫొటోల‌ను ఆమె షేర్ చేసింది. అందులో త‌న భ‌ర్త దీప‌క్‌రావుతో క‌లిసి ఆమె త‌న కుమార్తెను లాలిస్తున్న ఫొటోల‌ను చూడ‌వ‌చ్చు.

hariteja posted pics of her daughter bhumi deepak rao

ఇక త‌న కుమార్తెకు ఇటీవ‌లే బార‌సాల ఫంక్ష‌న్ అయింద‌ని, త‌న కుమార్తెకు భూమి దీప‌క్‌రావు అని పేరు పెట్టాన‌ని ఆమె తెలిపింది. అయితే కుమార్తె పుట్టిన‌ప్ప‌టి నుంచి హ‌రితేజ ఇప్ప‌టి వ‌ర‌కు ఫొటోల‌ను పోస్ట్ చేయ‌లేదు. కానీ ఎట్టకేల‌కు త‌న కుమార్తె ఫొటోల‌ను ఆమె రివీల్ చేసింది. దీంతో నెటిజ‌న్లు ఆ ఫొటోల‌ను ఆస‌క్తిగా చూస్తున్నారు.

https://www.instagram.com/p/CRF1qp-hF13/?utm_source=ig_embed&ig_rid=91f67984-d053-496e-92bc-773c364c72ab

కాగా ఆ ఫొటోల ప‌ట్ల ప‌లువురు బుల్లి తెర న‌టులు త‌మ కామెంట్ల‌ను పెట్టారు. వారు సంతోషం వ్య‌క్తం చేశారు. హ‌రితేజ లాగే పాప ముద్దుగా ఉంద‌ని అంటున్నారు. సీరియ‌ల్స్, షోల‌లో యాంక‌ర్‌గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న హ‌రితేజ సినిమాల్లోనూ త‌న స‌త్తా చాటింది. బిగ్‌బాస్ సీజ‌న్ 1లోనూ మేల్ కంటెస్టెంట్ల‌కు గ‌ట్టి పోటీ ఇచ్చింది. 2015లో ఆమెకు వివాహం కాగా గ‌త ఏప్రిల్ 5న ఆమె కుమార్తెకు జ‌న్మ‌నిచ్చింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment