Almonds For Brain Health : వీటిని తింటే చాలు.. జ్ఞాప‌క‌శ‌క్తి అద్భుతంగా పెరుగుతుంది..!

August 9, 2023 11:56 AM

Almonds For Brain Health : ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటారు. అందుకు తగ్గట్టుగా మార్పులు కూడా చేసుకుంటూ ఉంటారు. మెదడు ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ పెట్టి మెదడు ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్థాలను తీసుకుంటే మెదడు బాగా పనిచేస్తుంది. షార్ప్ గా ఉంటుంది. మెదడు ఆరోగ్యాన్ని పెంపొందించడానికి ఎలాంటి ఆహార పదార్థాలను తీసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. ఇక మరి ఆరోగ్య నిపుణులు చెప్పిన అద్భుతమైన విషయాలని చూసేయండి.

వయసు పెరిగే కొద్దీ కూడా మతిమరుపు రావడం వంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఈరోజుల్లో ఆహార పదార్థాలు తీసుకునే పద్ధతి చాలా వరకు మారింది. ఎక్కువ మంది జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ కి అలవాటు పడిపోయారు. జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ ని తీసుకోవడం వలన ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది. మెదడుకు ఇవి ఇబ్బందిని కలిగిస్తాయి. ర్యాడికల్ డ్యామేజ్ ని కలిగించి అనేక రకాల సమస్యలకు గురిచేస్తాయి.

Almonds For Brain Health take them daily for better results
Almonds For Brain Health

మెదడు బాగా బలహీనంగా మారిపోతుంది. అయితే బ్రెయిన్ ఫంక్షన్ కోసం ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ బాగా ఉపయోగపడతాయి. పోషకాహారం తీసుకోవడం వలన ఒక ఆయుధంలా బ్రెయిన్ సెల్స్ పై ప్రభావం చూపిస్తాయి. ప్రతి రోజు నట్స్ ని తీసుకోవడం, ఒమేగా త్రీ, ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఉండే అవిసె గింజలు వంటివి తీసుకుంటే, మెదడు బాగా పనిచేస్తుంది.

ఇలా మెదడు పనితీరుని పెంపొందించుకోవచ్చు. అలానే వాల్ న‌ట్స్, బాదం పప్పుని తీసుకోవడం వలన కూడా మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. మెదడు పని తీరు బాగుంటుంది. కనుక వీటిని మీరు బాగా రోజు తీసుకుంటున్నట్లయితే, కచ్చితంగా మెదడు పని తీరు బాగుంటుంది. మెదడు ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. మతిమరుపు వంటి సమస్యలకు దూరంగా ఉండొచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment