Wife : భార్య ఈ తప్పులు చేస్తే.. భర్త‌కు ఆర్థిక బాధలు, ఇబ్బందులు తప్పవు..!

July 31, 2023 12:20 PM

Wife : మనం ఇళ్లల్లో పాటించే పద్ధతులే మనకి తిరిగి కొడుతూ ఉంటాయి. మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు మన ఇంటికి సమస్యల్ని తీసుకువస్తాయి. పొరపాటున కూడా ఇలాంటి పనులు అసలు చేయకూడదు. ముఖ్యంగా భార్యలు ఇటువంటి అలవాట్ల‌ను కలిగి ఉండకూడదు. ఇటువంటి అలవాట్లు కనుక భార్యలో ఉన్నట్లయితే డబ్బుని కోల్పోవాల్సి వస్తుంది. మరి భార్య ఎటువంటి చెడు అలవాట్లకి దూరంగా ఉండాలి..? ఎలాంటి తప్పులు చేయకూడదు.. అనేది ఇప్పుడే చూసేద్దాం.

భర్త పనికి వెళ్లేటప్పుడు భార్య కోపం తెచ్చుకోవడం లేదా వాదించడం తప్పు. ఇలా చేయడం వలన భర్త తన పని మీద మనసు పెట్టలేడు. అలానే ఆర్థిక నష్టం కలుగుతుంది. అనవసరంగా ధన నష్టం కలుగుతుంది. భర్త వెళ్లిన వెంటనే చాలా వేగంగా తలుపు మూసేయడం కూడా తప్పు. అలా కూడా అస్సలు భార్యలు చేయకూడదు. భర్త బయటకి వెళ్ళిన తర్వాత గుమ్మం దగ్గరే అలా నిలబడడం తప్పు. భర్త బయటకి వెళ్ళిన తర్వాత భార్య ఇంట్లో ఉండాలి. అంతేకానీ భర్త వెళ్ళిపోగానే గుమ్మం వద్ద నిలబడటం, బయటకు వెళ్లడం మంచిది కాదు.

if Wife do this husband will get troubles
Wife

రొట్టెలు చేశాక నీళ్లతో చేతులు కడుక్కోకపోవడం కూడా తప్పు. రొట్టెలు చేసిన వెంటనే చేతులు కడుక్కోవాలి. భర్త వెళ్లిన వెంటనే ఇల్లు ఊడ్చి శుభ్రం చేయడం కూడా మంచిది కాదు. ఎప్పుడూ కూడా ఎవరైనా బయటకు వెళ్లిన తర్వాత ఇల్లు ఉడకకూడదు. భర్త బయటకు వెళ్ళగానే వంట వండడం, లేదంటే వంటింటిని శుభ్రం చేయడం కూడా మంచిది కాదు.

తలకిందులుగా బట్టలు మడత పెట్టడం కూడా తప్పు. బియ్యం, పంచదార లేదా ఉప్పు అప్పు అడగడం, ఉదయాన్నే భర్తకు ఖర్చులు లెక్క ఇవ్వడం లేదా అడగడం కూడా తప్పు. ఇటువంటి అలవాట్లు ఉంటే మానుకోండి. దీని వలన అనవసరంగా డబ్బుని కోల్పోవాల్సి వస్తుంది. ధన నష్టం కలుగుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now