Fat Cysts : శ‌రీరంలో ఎక్క‌డ కొవ్వు గ‌డ్డలు ఉన్నా స‌రే.. ఇలా చేస్తే క‌రిగిపోతాయి..!

July 30, 2023 8:47 AM

Fat Cysts : ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటారు. శరీరంలో ఎక్కడ కొవ్వు గడ్డలు ఉన్నా కూడా ఇలా చేయండి. వెంటనే కరిగిపోతాయి. మనల్ని ఇబ్బంది పెట్టే వాటిల్లో కొవ్వు గడ్డలు కూడా ఒకటి. శరీరంలో అధికంగా చేరిన కొవ్వు గడ్డ‌ల్లా ఏర్పడి కొవ్వు గడ్డలు కలుగుతుంటాయి. ఎక్కడైనా కూడా ఇవి కలిగే అవకాశం ఉంటుంది. ఈ గడ్డల్ని ఎడిమా అని కూడా అంటారు. నరాల‌ మీద ఇవి కొన్ని కొన్ని సార్లు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది.

దాంతో నొప్పి ఎక్కువగా కలుగుతుంది. అయితే ఈ కొవ్వు గడ్డల వల్ల ఎక్కువగా నష్టం ఏమీ లేదు. కానీ కొన్ని కొన్ని సార్లు ఇవి క్యాన్సర్ గడ్డలుగా మారొచ్చు. అందుకని ఈ విషయంలో జాగ్రత్త పడడం మంచిది. ఈ కొవ్వు గడ్డల్ని తగ్గించుకోవడానికి ఆయుర్వేద చిట్కాలు చాలా చక్కగా పనిచేస్తాయి. ఇలా పాటిస్తే కొవ్వు గడ్డల‌ సమస్య నుండి బయట పడొచ్చు.

Fat Cysts home remedy follow this
Fat Cysts

కొవ్వు గడ్డల్ని తగ్గించడానికి పచ్చి పసుపు బాగా ఉపయోగపడుతుంది. మనకి ఇది సులభంగానే మార్కెట్లో దొరుకుతుంది. ఆయుర్వేద షాపుల్లో అడిగి చూస్తే తెలుస్తుంది. కేవలం పచ్చి పసుపును మాత్రమే వాడాలి. ఇంట్లో వాడే పసుపుని కాదు. పచ్చి పసుపుని ఒక టీ స్పూన్ మోతాదులో తీసుకోవాలి.

ఆ తర్వాత నాలుగు లవంగాలని పొడి చేసి ఆ పొడిని కూడా వేసుకోండి. ఇందులోనే ఒక టీ స్పూన్ ఆవనూనె కూడా వేసుకోండి. వీటన్నింటినీ బాగా కలిపి కొవ్వు గడ్డల‌ మీద రాసుకోవాలి. ఆ తర్వాత కాటన్ క్లాత్ తో కట్టు కట్టండి. రాత్రంతా ఇలా వదిలేసి ఉదయాన్నే శుభ్రం చేసుకోండి. క్రమం తప్పకుండా ప్రతిరోజు ఇలా చేస్తే, సులభంగా కొవ్వు గడ్డలు కరిగిపోతాయి. గడ్డల వల్ల కలిగే నొప్పి, వాపు వంటివి కూడా తగ్గిపోతాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment