Non Veg : మాంసాహారం ఇంత ప్రమాదమా..? మాంసాహారం తినే ప్రతి ఒక్కరు ఇవి తెలుసుకోవాలి..!

July 21, 2023 12:50 PM

Non Veg : ఈ రోజుల్లో చాలా మంది మాంసాహారం ఆరోగ్యానికి మంచిది కాదని శాకాహారులు కింద మారిపోతున్నారు. మాంసాహారం తినే వాళ్లు కచ్చితంగా ఈ విషయాలని తెలుసుకోవాలి. మాంసాహారాన్ని తీసుకునేటప్పుడు ఇలాంటి పొరపాట్లను చేస్తే కచ్చితంగా ఆరోగ్యం పాడుతుంది. లేనిపోని సమస్యలు వస్తాయి. చాలామంది మాంసాహారాన్ని, కోడిగుడ్లు తినడం వలన దృఢంగా ఉంటారని అంటుంటారు. కానీ అది నిజం కాదు.

మనిషి పేగులు ఆరు మీటర్లు పొడవు ఉంటాయి. 20 అడుగులు ఉంటాయి. అందుకనే విసర్జనకి ఎక్కువ సమయం పడుతుంది. పైగా మానవ శరీరం మాంసాహారం తీసుకోవడానికి అనువుగా ఉండదు. అలానే మాంసాహారం, గుడ్లు, పాలు కలిపి తీసుకోకూడదు. మాంసాహారం తిన్న మనిషికి క్రూరత్వం పెరుగుతుంది. అలానే కోపం కూడా పెరుగుతుంది. మాంసాహారాన్ని తీసుకున్న తర్వాత నీరసం బాగా వస్తుంది. జబ్బులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది.

Non Veg can we take them or not
Non Veg

నిజానికి జీవ హింస చేయకూడదు. మానవుడు ఆహారాన్ని కనుగొనక ముందు మాంసాన్ని కాల్చుకుని తినడం మొదలుపెట్టారు. అప్పట్లో అంటే ఆహారం లేక తిన్నారు. ఈ రోజుల్లో రకరకాల వంటలు మనం చేసుకోవచ్చు. శాకాహారం తీసుకునే వాళ్ళకి ఆయువు ఎక్కువ రోజులు ఉంటుంది. మాంసాహారాన్ని తీసుకున్న తర్వాత అది పూర్తిగా అరిగే వరకు ఒకటి రెండు రోజులు ఏమీ తినకుండా ఉండడం మంచిది. జంతువులు ఎప్పుడైనా సరే మాంసాహారం తీసుకున్న తర్వాత ఒకటి రెండు రోజులు ఏమీ తినవు. కాబట్టి జంతువుకి ఆ మాంసాహారం పడుతుంది.

మనిషి మాత్రం రోజు తింటూనే ఉంటాడు కాబట్టి మాంసం ఎక్కువ తినడం మంచిది కాదు. చాలామంది మాంసాహారం తింటే బరువు పెరగచ్చు. లావు అవ్వచ్చు. లేదంటే ఆరోగ్యంగా ఉండొచ్చు అని అనుకుంటారు. కానీ మాంసాహారమే అందుకు తినక్కర్లేదు. శాకాహారంలో కూడా ఎన్నో పోషకాహార పదార్దాలు ఉన్నాయి. మాంసానికి బదులుగా మీరు శాకాహారంలో ఉండే ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవచ్చు. నిజానికి ప్రతిరోజు ఆకుకూరలు, పప్పులు, కాయగూరలు తీసుకుంటే మరింత ఆరోగ్యంగా ఉండొచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment