జ‌గ‌న్ ప్ర‌భుత్వ అరాచ‌కాల‌ను యువ‌త నిల‌దీయాలి: అచ్చెన్నాయుడు

April 4, 2021 1:55 PM

సీఎం జ‌గన్ ప్ర‌భుత్వ అరాచ‌కాల‌ను యువ‌త నిల‌దీయాల‌ని ఏపీ తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. ఆదివారం తిరుప‌తిలో తెలుగు యువ‌త ఆధ్వ‌ర్యంలో యువ చైత‌న్య యాత్ర నిర్వ‌హించారు. తెలుగు యువ‌త రాష్ట్ర అధ్య‌క్షుడు శ్రీ‌రామ్ చిన్న‌బాబు, చింత‌కాయ‌ల విజ‌య్‌ల ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

Youth should stop Jagan government anarchy: atchannaidu

ఈ సంద‌ర్బంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిలో యువ‌త ముఖ్య పాత్ర పోషిస్తున్నార‌ని అన్నారు. యువ‌త త‌ల‌చుకుంటే ఏదైనా సాధించ‌గ‌ల‌ర‌ని అన్నారు. గ‌త 2 సంవ‌త్స‌రాల నుంచి ప్ర‌భుత్వం యువ‌త‌ను, విద్యార్థుల‌ను ప‌ట్టించుకోలేద‌ని అన్నారు. సీఎం జ‌గ‌న్‌ను యువ‌త నిల‌దీయాల‌ని లేదంటే రాష్ట్ర భ‌విష్య‌త్తు ప్ర‌శ్నార్థ‌కంగా మారుతుంద‌న్నారు.

సీఎం జ‌గ‌న్ గ‌తంలో ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న‌ప్పుడు కాలేజీలు తిరుగుతూ యువ‌త‌ను రెచ్చ‌గొట్టార‌ని ఆరోపించారు. వైకాపా అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి రాష్ట్రంలో ఒక్క ప‌రిశ్ర‌మ కూడా ఏర్పాటు కాలేద‌ని అన్నారు. 2 సంవ‌త్స‌రాల నుంచి నిరుద్యోగ భృతిని ఇవ్వ‌డం లేద‌న్నారు. ప్ర‌భుత్వ ఉద్యోగాల‌ను క‌ల్పించ‌లేద‌న్నారు. క‌నుక యువ‌త మేల్కొనాల‌ని, తిరుప‌తి ఉప ఎన్నిక‌లో వైకాపాకు బుద్ధి చెప్పాల‌ని పిలుపునిచ్చారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment