Habits : మ‌న‌ల్ని క‌ష్టాల పాలు చేసే అల‌వాట్లు ఇవి.. వెంట‌నే మానేయండి.. లేదంటే అరిష్టం..!

June 26, 2023 12:30 PM

Habits : మనం చేసే పొరపాట్ల వల్ల కష్టాలు పాలవ్వాల్సి ఉంటుంది. అందుకని తెలిసి కానీ తెలియక కానీ మనం తప్పులు చేయకూడదు చాలా మంది రోజు చేసే పొరపాట్లు ఇవి. ఇలాంటి అలవాట్లు ఉంటే వాటికి దూరంగా ఉండటం మంచిది లేకపోతే కష్టాలు తప్పవు. పొద్దు ఎక్కే దాకా ఇంట్లో నిద్రలేకుండా అలా పడుకోవడం మంచిది కాదు. లేచిన వెంటనే కల్లాపు చల్లడం మంచిది కాదు. నిద్రలేవగానే దుప్పటిని వెంటనే మడత పెట్టాలి. లేకపోతే దరిద్ర దేవత ఆసనంగా అక్కడే కూర్చుని ఉంటుంది.

అన్నం తిన్న తర్వాత ఎంగిలికంచాన్ని వెంటనే తీసేయాలి. మాసిన బట్టల్ని ఉతికిన తర్వాత స్నానం చేయాలి. బట్టలు పిండిన నీటిని కాళ్ళ మీద అసలు పోసుకోకూడదు. ఇల్లు ఊడ్చిన తర్వాత చీపురుని అసలు నిలబెట్టకూడదు. వంట అయిన తర్వాత వంట గదిలో సామాన్లు ని వెంటనే శుభ్రం చేసుకోవాలి. పూజ గదిలో ఒకే రూపానికి చెందిన రెండు చిత్రపటాలని పెట్టకూడదు. సాయంత్రం 6 దాటాక సూది, ఉప్పు, నూనె ఇంటికి తెచ్చుకోకూడదు. సంధ్యాకాలంలో సంసారం నిషేధం. ఆ సమయంలో నిద్ర పోకూడదు కూడా.

these bad Habits will bring bad luck
Habits

పొద్దెక్కిన తర్వాత పెరుగు, మినప పొడి ఎవరికి ఇవ్వకూడదు. కూరగాయలను కూడా ఎవరికి ఇవ్వకూడదు. ముఖ్యంగా శుక్రవారం మంగళవారం ఎవరికీ ఇవ్వకూడదు. శనివారం నాడు చెప్పులు, గొడుగు, నూనె ఇంటికి తెచ్చుకోకూడదు. శనివారం నాడు నలుపు దుస్తులు అసలు వేసుకోకూడదు. ఇంటికి తెచ్చుకోకూడదు కూడా. శనివారం నాడు చెప్పులు, నల్లని వస్తువులు, నీలం వస్తువులు ఇస్తే తీసుకోకండి. ఇంటిని ఎప్పుడు శుభ్రంగానే ఉంచుకోవాలి. స్నానం చేసిన తర్వాత తుడిచిన తువ్వాలని తలుపు మీద వేయకూడదు. ఉదయం లేవగానే పాచి ముఖంతో అద్దంలో చూసుకోకూడదు. ఇంటి గుమ్మాల మీద కూర్చుని మాట్లాడుకోకూడదు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment