Cloves : లవంగాలతో ఇలా చేస్తే చాలు.. ఇక మీకు తిరుగే లేదు.. లక్ష్మీ కటాక్షమే..!

June 24, 2023 3:18 PM

Cloves : పని చేసేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆ పని బాగా జరగాలని.. విజయం అందుకోవాలని అనుకుంటారు. అలానే ఎప్పుడు కూడా కష్టాలు ఉండకూడదని మంచిగా జీవితంలో పైకి రావాలని కోరుకుంటారు. బయటికి వెళ్ళినప్పుడు పని అవుతుందా లేదా అని చాలామంది టెన్షన్ పడుతూ ఉంటారు. బయటికి వెళ్లే ముందు ఆ పని జరగాలని మీరు అనుకుంటే రెండు లవంగాలని జేబులో వేసుకోండి. అదేవిధంగా రెండు లవంగాలని నోట్లో కూడా వేసుకోండి. ఇలా చేస్తే మీరు చేసే పనిలో విజయం కచ్చితంగా ఉంటుంది. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది.

ఐశ్వర్యం కలగాలంటే శుక్రవారం నాడు ఒక ఎర్రటి వస్త్రం తీసుకుని అందులో ఐదు లవంగాలని ఐదు గవ్వలని కట్టి ఈ మూటని మీరు బీరువాలో కానీ డబ్బులు దాచుకునే చోట కానీ పెట్టండి ఇలా చేస్తే ఐశ్వర్యం కలుగుతుంది. ధనం పెరుగుతుంది. ఆర్థిక బాధల నుండి బయటపడొచ్చు. హనుమంతుడు ముందు ఒక జత లవంగాలని పెట్టి మంగళవారం నాడు ఆవ నూనె తో దీపాన్ని వెలిగించి హనుమాన్ చాలీసా చదివితే కూడా కష్టాలు గట్టెక్కుతాయి. 21 మంగళవారాలు ఈ విధంగా చేస్తే కష్టాల నుండి పూర్తిగా బయటపడి ఆనందంగా జీవించొచ్చు.

do like this with Cloves for luck and wealth
Cloves

శనివారం నాడు లవంగాలని ఎవరికైనా దానం చేస్తే కూడా చక్కటి ఫలితాన్ని పొందొచ్చు. కాబట్టి శనివారం నాడు లవంగాలని ఎవరికైనా దానం చేయండి, ఒకవేళ ఎవరూ తీసుకోకపోతే శివుడికి ఇవ్వచ్చు ఇలా ఈ 41 రోజులు పాటు మీరు చేశారంటే అనుకున్న పనులు అవుతాయి ఇబ్బందుల నుండి బయటపడవచ్చు.

మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చి ఆ డబ్బు కనుక మీకు వారి ఇవ్వకపోయినాట్లయితే అమావాస్యనాడు కానీ పౌర్ణమి నాడు కానీ 11 లేదా 21 లవంగాలను కర్పూరంలో వేసి కాల్చండి. ఆ తర్వాత లక్ష్మీదేవిని స్మరించుకోండి. అప్పుడు రావాల్సిన డబ్బులు కచ్చితంగా వచ్చేస్తాయి. అలానే తంత్ర శాస్త్రం ప్రకారం లక్ష్మీదేవిని కొలిచేటప్పుడు రెండు లవంగాలని రెండు గులాబీలని వేయండి. దీనిని ప్రతి రోజు చేస్తే మంచిదే లేదంటే శుక్రవారం నాడు అయినా చేయండి ఇలా చేస్తే సంపద కలుగుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now