House Main Door : ఇంటి ప్ర‌ధాన ద్వారం వ‌ద్ద ఇలా చేస్తే చాలు.. మీ అదృష్టానికి తిరుగుండ‌దు.. డ‌బ్బే డ‌బ్బు..!

June 23, 2023 7:48 AM

House Main Door : ప్రతి ఒక్కరు కూడా అదృష్టం కలగాలని మంచే జరగాలని కలకాలం కలిసి ఆనందంగా జీవించాలని ఉంటుంది. అయితే అందరికీ అదే సాధ్యం కాదు. ఒక్కొక్కసారి దురదృష్టం కూడా వెంటాడుతూ ఉంటుంది. అలాంటప్పుడు మనం చేయాలనుకునే పనులు పూర్తి అవ్వవు పనులు మొదలు పెట్టినప్పుడే ఆటంకం రావడం లేదంటే మధ్యలో ఆటంకం కలగడం వంటివి జరిగి విజయాన్ని అందుకోలేకపోతూ ఉంటాము. ఇటువంటివి ఏమీ లేకుండా అదృష్టం మీ వెంటే ఉండాలంటే ఇలా చేయండి.

ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఈ మార్పులు చేశారంటే కచ్చితంగా మీ వెంట అదృష్టం ఉంటుంది ముఖ్యంగా మీ ఇంటి ముఖద్వారం సరిగ్గా లేకపోతే ఇంట్లో సంతోషం ఉండదు. ఇంటి ప్రధాన ద్వారం శుభప్రదంగా పరిపూర్ణంగా ఉండాలంటే కొన్ని వస్తువులని ఉపయోగించవచ్చు. ఇంట్లో సంతోషం కలగాలన్నా శ్రేయస్సు కలగాలన్నా ప్రధాని దూరం చాలా ముఖ్యమైనది.

House Main Door do like this for luck
House Main Door

ఒకవేళ కనుక అది సరిగ్గా లేదు అంటే ఇంట్లో సంతోషం ఉండదు. అయితే పరిపూర్ణంగా ఉంచుకోవాలన్నా అదృష్టం కలగాలన్నా ఈ మార్పులు చేయండి ఇంటి ప్రధాన ద్వారానికి రెండు వైపులా ఎరుపు రంగుతో స్వస్తిక్ రాయండి ఇలా స్వస్తిక్ రాస్తే ఆనందంగా ఉండొచ్చు అదృష్టం కలుగుతుంది. ఇళ్లల్లో ఏదైనా శుభకార్యాలు జరిగినప్పుడు మొదట కలశ స్థాపన చేసి తర్వాత పూజ చేస్తారు. ఇంటి ప్రధాన ద్వారం దగ్గర కలశాన్ని ఏర్పాటు చేస్తే లక్ష్మీదేవి అక్కడ కొలువై ఉంటుంది.

కుటుంబ సభ్యులు సంతోషంగా జీవితాన్ని గడపొచ్చు. మీ ఇంటి ప్రధానం ద్వారం దగ్గర పండ్లు ఆకులతో చేసిన దండని పెట్టి అలంకరించాలంటే ఇంట్లో శ్రేయస్సు కలుగుతుంది. ఐశ్వర్యం వస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య బంధాలు బాగుంటాయి. ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి మొక్క ఉండాలి. ప్రతి రోజు తులసి మొక్కకి నీళ్లు పోయాలి ఇలా ఈ పద్ధతుల్ని పాటిస్తే అదృష్టం మీ వెంటే ఉంటుంది విజయం మీ తోడే ఉంటుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment