సదా అమ్మానాన్నల గురించి ఈ విషయాలు తెలుసా ?

June 30, 2021 7:08 PM

తేజ దర్శకత్వంలో తెరకెక్కిన “జయం” సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన నటి సదా. మొదటి సినిమానే అద్భుతమైన విజయం సాధించడంతో తెలుగులో వరుస సినిమాలతో దూసుకుపోతూ స్టార్ హీరోయిన్ గా గుర్తింపును సంపాదించుకుంది. కెరీర్ మంచి పీక్లో ఉన్న సమయంలో సదా ఉన్నఫలంగా సినిమాలకు దూరమయ్యారు.తాజాగా బుల్లితెరపై ప్రసారమయ్యే ఓ కార్యక్రమంలో పాల్గొన్న సదా తను సినిమాలు చేయకపోవడానికి కారణం ఏమిటి? తన తల్లిదండ్రుల గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.

ఈటీవీలో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చిన సదా తన తల్లిదండ్రుల గురించి, తన వ్యక్తిగత జీవితం గురించి తెలియజేశారు. ఈ సందర్భంగా తన తల్లి హిందూ, తన తండ్రి ముస్లిం.వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకోవడం వల్ల రెండు కుటుంబాలకు దూరమయ్యారు. వృత్తిపరంగా అమ్మ టీచర్.. నాన్న డాక్టర్.అయితే తనకు రక్తం అంటే భయం ఉండటం వల్ల మెడిసిన్ వైపు కాకుండా ఇంజినీరింగ్ వైపు అడుగులు వేశానని తెలిపారు. ఈ విధంగా ఇంజనీరింగ్ చేసే సమయంలో బాంబేలో యాక్టింగ్ స్కూల్లో చేరి ఈ విధంగా సినీ ఇండస్ట్రీలో వచ్చినట్లు తెలిపారు.

2017 వ సంవత్సరంలో అమ్మ రిటైర్డ్ కావటానికి పది రోజుల ముందు తన పుట్టిన రోజు. తాను పుట్టిన రోజు నాడే ఆమెకు క్యాన్సర్ ఉందని తెలియడంతో ఎంతో కృంగి పోయానని ఈ కారణం వల్లే తనకు సినిమా అవకాశాలు వచ్చినా చేయడానికి ఒప్పుకోకపోవడంతో ఇండస్ట్రీకి దూరమయ్యానని ఈ సందర్భంగా సదా తెలియజేశారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment