Milk And Milk Products : ప‌ర‌గ‌డుపునే పాలు, పెరుగు, మ‌జ్జిగ‌.. తీసుకోకూడ‌దా.. ఏం జ‌రుగుతుంది..?

April 18, 2023 1:35 PM

Milk And Milk Products : పాలు, పెరుగు, మజ్జిగ.. మన దైనందిన జీవితంలో వీటి ఆవశ్యకత ఎంతగా ఉందో అందరికీ తెలుసు. సాధారణంగా మనం భోజనం సమయంలో పెరుగు, మజ్జిగను, ఇతర సమయాల్లో పాలను తీసుకుంటాం. అయితే వీటిని ఉదయాన్నే పరగడుపున మాత్రం తాగకూడదు. ఎందుకో చూద్దాం పదండి. పాలు, దాని సంబంధ ఉత్పత్తుల్లో వేర్వేరు మోతాదుల్లో లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా ఉంటుంది. ఇది శరీర రోగ నిరోధక శక్తిని పెంచడంతోపాటు పలు ఇన్‌ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడుతుంది. దీంతోపాటు మన ఆరోగ్యాన్ని కూడా సంరక్షిస్తుంది.

అయితే ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు పొట్టలో యాసిడ్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో పాల ఉత్పత్తులను తీసుకోకూడదు. అలా తీసుకుంటే వాటిలో ఉండే లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా యాసిడ్ ప్రభావానికి త్వరగా చనిపోతుంది. దీంతో వాటి వల్ల మనకు ఎలాంటి ప్రయోజనం చేకూరదు.

Milk And Milk Products you should not take them on empty stomach
Milk And Milk Products

కాబట్టి పరగడుపున కాకుండా ఏదైనా తిన్న తరువాత పాల ఉత్పత్తులను తీసుకుంటే మంచిది. దీంతో స‌ద‌రు మంచి బాక్టీరియాకు ఎలాంటి హాని జ‌ర‌గ‌దు. దీంతో ఆ బాక్టీరియా మ‌న జీర్ణ‌వ్య‌వ‌స్థ‌ను సంర‌క్షిస్తుంది. దీంతో జీర్ణ స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment