Lips : పెద‌వుల‌ ఆకృతిని బట్టి స్త్రీల మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసా..?

April 15, 2023 7:32 PM

Lips : మనిషి శరీరం, ఆకృతి, ముఖ కవళికలు, చేతి రేఖలు.. తదితర అంశాలను పరిశీలించడం ద్వారా ఆ మనిషి వ్యక్తిత్వాన్ని ఎలా తెలుసుకోవచ్చో అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడదే కాదు, లిప్సాలజీ అనే మరో పద్ధతిలో కూడా వ్యక్తుల మనస్తత్వాలను, ముఖ్యంగా స్త్రీల స్వభావాన్ని తెలుసుకోవచ్చట. మహిళల మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టమని పెద్దలు చెబుతారు. అయితే లిప్సాలజీ ద్వారా వారి స్వభావం ఎలా ఉంటుందో ఇట్టే తెలుసుకోవచ్చట. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

హృదయాకారంలో పెదాలు ఉంటే వారు చాలా అందంగా ఉంటారట. దీంతోపాటు వారు రొమాంటిక్‌గా కూడా ఉంటారట. వీరు అత్యంత ప్రతిభావంతులట. అసాధారణ స్థాయిలో తెలివితేటలను, సృజనాత్మకతను, ఉత్సాహాన్ని కలిగి ఉంటారట. వెడల్పాటి పెదాలను కలిగి ఉన్న స్త్రీలు బాగా ఉత్సాహంగా ఉంటారట. తమలోని విషయాలను దాచి ఉంచలేని ఎక్స్‌ట్రావర్ట్ (బహిర్ముఖ)లుగా ప్రవర్తిసారట. వృత్తిని ప్రేమించడంతోపాటు నాయకత్వ లక్షణాలను అధికంగా కలిగి ఉంటారట. సన్నని, పలుచని పెదాలు కలిగి ఉన్న వారు లక్ష్యసాధన దిశగా పనిచేస్తారట. తాము అనుకున్నది నెరవేరే వరకు ఎదురు చూస్తారట. వీరు ఇతరులను జాగ్రత్తగా చూసుకునే వారై, సున్నిత మనస్తత్వం కలిగిన‌వారై ఉంటారట.

Lips of women and their personalities
Lips

పెద్దవైన పెదాలు కలిగిన వారు ఇతరులను జాగ్రత్తగా చూసుకునే స్వభావం కలిగి ఉంటారు. వీరు పైకి చాలా దృఢంగా, బలమైన ఆత్మవిశ్వాసం కలిగి ఉన్న వారై కనిపిస్తారు. ఇతరులతో మంచి సంబంధాలను కలిగి ఉంటారు. గుండ్రని పెదాలు కలిగి ఉన్నవారు ఎలాంటి రిస్క్ తీసుకునేందుకైనా సిద్ధంగా ఉంటారట. అత్యంత ధైర్య సాహసాలను కలిగి ఉంటారు. అంతేకాకుండా పట్టుదల, ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు. పైభాగంలో పెద‌వులు ప‌దునుగా కలిగి ఉన్నవారికి జీవితంలో చక్కని భాగస్వామి దొరుకుతారట. వీరు అత్యంత సంతోష‌వంతులుగా ఉంటార‌ట‌.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment