Combing : ఎక్కువసార్లు తల దువ్వుకుంటే ఏం జరుగుతుందో తెలుసా..?

April 14, 2023 5:31 PM

Combing : మనకు అందాన్ని కలిగించేవి ఏవి..? అంటే.. ఠక్కున గుర్తుకు వచ్చేది ముఖం. శరీర ఆకృతి కూడా మనకు అందాన్నిస్తుంది. అయితే ప్రధానంగా చెప్పుకోదగినది ముఖమే. చక్కని రంగు, ముఖ వర్చస్సు, సౌష్టవం కలిగి ఉండడమే కాదు, వీటన్నింటికి తోడు తలపై ఉండే జుట్టు కూడా నిర్దిష్టమైన ఆకారంలో ఉంటేనే అప్పుడు మరింత అందంగా కనిపించవచ్చు. అయితే జుట్టు కేవలం అందాన్నివ్వడం కోసమే అనుకుంటే మీరు పొరపాటు పడినట్టే. ఎందుకంటే దాంతో చెప్పుకోదగిన ఉపయోగాలు కూడా ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

జుట్టు దువ్వుకున్నప్పుడు కుదుళ్లకు దువ్వెన తాకడం వల్ల అక్కడ ఉన్న రక్తనాళాల్లో చలనం వచ్చి రక్త సరఫరా కూడా మెరుగుపడుతుంది. దీంతోపాటు జుట్టుకు కావల్సిన పోషకాలు, ఆక్సిజన్ లభిస్తాయి. ఇది జుట్టు కుదుళ్లను దృఢంగా ఉంచేందుకు ఉపయోగపడుతుంది. అంతేకాదు జుట్టు పెరుగుదలను కూడా ప్రోత్సహిస్తుంది. సాధారణంగా మన తలపై ఉండే వెంట్రుకలు సెబమ్ అనే ఓ సహజసిద్ధమైన నూనెను కలిగి ఉంటాయి. అయితే తల దువ్వుకున్నప్పుడు ఈ నూనె జుట్టుకంతా విస్తరింపబడుతుంది. దీంతో వెంట్రుకలు తేమగా, మృదువుగా మారతాయి. జుట్టు కుదుళ్లపై పీహెచ్ బ్యాలెన్స్ సరిగ్గా ఉంటుంది.

Combing hair many times what happens
Combing

తల జుట్టును ఎక్కువగా దువ్వుకుంటే పైన తెలిపిన సెబమ్ నూనె వెంట్రుకల చివర్లకు చేరి వాటికి మరింత అందాన్ని, ప్రకాశాన్ని ఇస్తుంది. జుట్టు దువ్వుకున్నప్పుడల్లా కుదుళ్ల వద్ద ఉండే డెడ్ స్కిన్ సెల్స్, ఇతర నిర్జీవ కణాలు బయటికి వెళ్లిపోతాయి. ఇది వెంట్రుకలకు ఎంతో రక్షణనిస్తుంది. దీంతోపాటు వెంట్రుకలు రాలిపోవడం, చుండ్రు వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment