Navagraha Mandapam : శివాలయాల్లోనే ఎక్కువ‌గా న‌వ‌గ్రహాలు ఎందుకు ఉంటాయో తెలుసా..?

April 7, 2023 8:15 AM

Navagraha Mandapam : న‌వ‌గ్ర‌హాల గురించి తెలుసు క‌దా. బుధుడు, శుక్రుడు, కుజుడు, బృహ‌స్పతి, శ‌ని, రాహువు, కేతువు, సూర్యుడు, చంద్రుడు అని మొత్తం 9 గ్ర‌హాలు ఉంటాయి. వీటి స్థితి కార‌ణంగానే వ్య‌క్తుల జాత‌కాలు చెబుతారు జ్యోతిష్యులు. ఈ క్ర‌మంలో ఏవైనా గ్ర‌హ దోషాలు ఉంటే కొంద‌రు పూజ‌లు కూడా చేస్తారు. అయితే ఈ న‌వ‌గ్ర‌హాలు అనేవి ప్ర‌ధానంగా శివాల‌యాల్లోనే మ‌న‌కు ఎక్కువ‌గా క‌నిపిస్తాయి. దీనికి కార‌ణం ఏమిటో తెలుసా..? అదే తెలుసుకుందాం ప‌దండి..!

న‌వ‌గ్రహాల‌లో ఒక్కో గ్ర‌హానికి ఒక్కో అధిష్టాన దేవ‌త ఉంటుంది. ఆ దేవ‌త‌ల‌ను నియ‌మించింది శివుడే. దీంతోపాటు గ్రహాలకు మూలమైనటువంటి సూర్యదేవుడికి అధిదేవత కూడా శివుడే. ఈ కారణంగానే గ్రహాలన్నీ కూడా శివుడి ఆదేశానుసారమే సంచరిస్తూ వుంటాయి. అందువల్లనే శివాలయాల్లో నవగ్రహ మంటపాలు ఎక్కువగా దర్శనమిస్తూ వుంటాయి.

Navagraha Mandapam why they appear in lord shiva temples only
Navagraha Mandapam

ఆదిదేవుడైన పరమశివుడి అనుగ్రహం ఉంటే నవగ్రహ దోషాలు ఎలాంటి ప్రభావం చూపలేవని పురాణాలు చెబుతున్నాయి. అందుకే చాలా మంది భ‌క్తులు శివాల‌యాల్లో న‌వ‌గ్ర‌హ పూజ చేసినా చేయ‌కున్నా, శివునికి మాత్రం క‌చ్చితంగా అభిషేకం లేదా అర్చన చేయిస్తారు. అలా చేస్తే న‌వ‌గ్ర‌హ దోషాలు ఉంటే పోతాయ‌ని భ‌క్తుల విశ్వాసం. అయితే శివాల‌యం కాకుండా కొన్ని ఇత‌ర ఆలయాల్లోనూ మ‌న‌కు న‌వ‌గ్ర‌హాలు ద‌ర్శ‌న‌మిస్తాయి. కానీ.. ఏ ఆల‌యంలో న‌వ‌గ్ర‌హ మండ‌పాలు ఉన్నా చుట్టూ ప్ర‌ద‌క్షిణ చేయ‌డం ఉత్త‌మం. అలా చేస్తే గ్ర‌హ దోషాలు పోతాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment