Praying To God : దేవున్ని కోరిన కోరిక‌ను బ‌య‌ట‌కు చెప్ప‌వ‌చ్చా.. చెబితే ఏమ‌వుతుంది..?

April 6, 2023 7:45 PM

Praying To God : గుడికి వెళ్లినప్పుడైనా, ఇంట్లో పూజ చేసుకున్నప్పుడైనా దేవుడిని మనం కోరికలు కోరుకుంటూ ఉంటాం. కోరిక చిన్నదైనా, పెద్దదైనా దేవుని కోరిన కోరిక బయటికి చెప్పకూడదు అనే మాట వింటూ ఉంటాం. అసలు మనం కోరుకున్న కోరికను ఎందుకు బ‌య‌టికి చెప్పొద్దంటారు. దాని వెనుక ఉన్న అసలైన కారణం ఏంటి.. అలా బ‌య‌టికి చెబితే ఏం జరుగుతుంది.. అంతేకాదు గుడికి వెళ్లినప్పుడు మనం ఏం చేయాలి.. తదితర విషయాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

దేవుడిని పూజించి కోరే కోరిక. బలీయమైనది.. కష్టమైనది.. మన వల్ల కానిది అయి ఉంటుంది.. అలాంటి కోరిక తీరిందంటే.. భగవంతుడు ఇచ్చాడంటే క‌చ్చితంగా ఎంతో ఆనందించే విషయమే అవుతుంది. అంత సుఖించే విషయం ధనం.. సౌఖ్యం.. మంచి భర్త.. లేదా భార్య.. పదవి ఏదైనా కావచ్చు. కోరిన కోరిక‌ను పైకి చెపితే విన్నవారు ఆనందంగా కనిపించినా.. లోలోన జరగకూడదని కోరుకోవచ్చు.పైకి మీ కోరిక తీరాలని మీతో చెప్పినప్పటికీ మనసులో మాత్రం తీరకూడదు అని కోరుకోవచ్చు. అలాంటి కోరిక‌ జరగకుండా తీరకుండా మానవ ప్రయత్నం చేయవచ్చు. కోరిన కోరిక బయటకు చెప్పొద్దని పెద్దలు చెప్పడం వెనుకున్న కారణం ఇదే. గుళ్లో ఏ విధంగా మసలుకోవాలో ఒకసారి చదవండి..

Praying To God our wish will be fulfilled or not if we tell it
Praying To God

గుడికి వెళ్ళినప్పుడు గట్టిగా నవ్వడం, అరవడం, ఐహిక విషయాల‌ గురించి మాట్లాడడం చేయ‌కూడదు. గుడి పరిస‌రాలను శుభ్రంగా ఉంచాలి. కొబ్బరి పెంకులు, అరటి తొక్కలు ఎక్కడబడితే అక్కడ వేయ‌కూడదు. దర్శనం లైన్ లో తోసుకోకూడదు. దానివలన ఇతరులకు, మనకు ఇబ్బందే. అందరూ మనతోపాటుగా దేవుడి దర్శనానికి వచ్చినవారే కాబట్టి అందరితోపాటుగా వెళ్ల‌డమే ఉత్తమం.

చాలామంది దేవుడి దగ్గరకు వెళ్లగానే కళ్లుమూసుకుని దండం పెట్టుకుంటారు. కానీ అలా చేయకూడదు. దేవుడిని ముందు తనివి తీరా చూడాలి. అంతేకానీ కళ్ళు మూసుకుని ఉండకూడదు. అంత దూరం వెళ్లింది దేవుడి దర్శనానికే కదా. అలాంటప్పుడు కళ్లు మూసుకుంటే దేవుడి దర్శనం ఎలా అవుతుంది. తీర్థం నిలబడే తీసుకోవాలి. ఇంట్లో అయితే తీర్థం కూర్చొని తీసుకోవాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment