Tulasi Plant : తులసి మొక్క దగ్గర ఈ వస్తువులు పెడుతున్నారా.. అయితే అంతా ద‌రిద్ర‌మే చుట్టుకుంటుంది జాగ్ర‌త్త‌..!

April 1, 2023 1:57 PM

Tulasi Plant : హిందువులు ప్ర‌తి ఒక్క‌రూ దాదాపుగా త‌మ ఇళ్ల‌లో తుల‌సి మొక్క‌ను పెంచుతుంటారు. కొంద‌రు తుల‌సి మొక్క‌ల‌ను ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు అందించే ఔష‌ధంగా పెంచుతారు. కొంద‌రు దీంతోపాటు ఆ మొక్క‌ను పూజించేందుకు కూడా పెంచుతారు. అయితే తుల‌సి మొక్క ఇంట్లో ఉందంటే.. దాని విష‌యంలో మాత్రం కొన్ని జాగ్ర‌త్త‌ల‌ను పాటించాల్సి ఉంటుంది. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

హిందూ పురాణాల ప్రకారం తులసి మొక్కకు చాలా ప్రాధాన్యం ఉంది. సకల దేవతల స్వరూపంగా కొలుస్తూ ఉంటారు. అలాంటి స్వచ్ఛమైన ఈ తులసి మొక్క వద్ద ఇలాంటి వస్తువులు పెట్టినట్లయితే నష్టాలు తప్పవంటున్నారు పండితులు. అవేంటో ఓ లుక్కేద్దాం. చాలామంది తులసి మొక్క దగ్గర శివలింగాన్ని పెట్టి పూజిస్తూ ఉంటారు. అలా ఉంచకూడదని పండితులు అంటున్నారు. అంతేకాకుండా తులసి మొక్క వద్ద ఇంట్లో శుభ్రం చేసుకునేటువంటి చీపురును ఉపయోగించి శుభ్రం చేయరాదని, అలా చేస్తే కష్టాలు తప్పవని అంటున్నారు.

Tulasi Plant do not put these items near to it
Tulasi Plant

తులసిలో లక్ష్మీదేవి ఉందని భావిస్తారు. కాబట్టి తులసి మొక్క చుట్టూ చెత్త ఉంటే లక్ష్మీదేవికి కోపం వస్తుందని అందుకే చెత్త ఉంచరాదని అంటున్నారు. ఇలాంటి జాగ్రత్తలు పాటించకపోతే ఇంట్లో అష్ట దరిద్రాలు చేరి నష్టాల పాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని పండితులు హెచ్చరిస్తున్నారు. క‌నుక తుల‌సి మొక్క విష‌యంలో త‌ప్ప‌నిస‌రిగా జాగ్ర‌త్త‌ల‌ను పాటించాల్సి ఉంటుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment