Lemon Leaves : ఈ ఆకులు నిజంగా బంగార‌మే.. ఎక్క‌డ క‌నిపించినా విడిచిపెట్ట‌కండి..!

March 30, 2023 10:00 PM

Lemon Leaves : మనం నిమ్మకాయను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. కానీ నిమ్మ ఆకుల‌ గురించి పెద్దగా పట్టించుకోము. నిమ్మ ఆకులలోనూ ఎన్నో ఆరోగ్యక‌ర‌మైన‌ ప్రయోజనాలు దాగి ఉన్నాయి. కానీ ఈ విషయాలు మనకు పెద్దగా తెలియదు. ఆయుర్వేదంలో నిమ్మ ఆకులను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. నిమ్మ ఆకులు ఎన్నో వ్యాధుల నివారణకు సహాయపడతాయి. నిమ్మ ఆకులు చేదుగా ఉంటాయని తినడానికి పెద్దగా ఆసక్తి చూపరు. నిమ్మ ఆకులను తినడం లేదా వాటి రసాన్ని తీసుకోవడం లేదా వాటి వాసన చూడడం వలన ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. అయితే నిమ్మ ఆకులను టీ లేదా జ్యూస్ వంటి వాటిలో వేసి తీసుకోవాలి.

నిమ్మ ఆకులలో యాంటీ వైరల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. అలాగే వీటిల్లో ఆల్కలాయిడ్స్, టానిన్లు, ఫ్లేవనాయిడ్స్, ఫినాలిక్ ఎలిమెంట్స్ ఉంటాయి. దీనితోపాటు కార్బొహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వులు వంటి పోషకాలు కూడా సమృద్దిగా ఉంటాయి. అలాగే యాంటెల్మింటిక్, యాంటీ ఫ్లాట్యులెంట్, యాంటీ మైక్రోబయల్, యాంటీ క్యాన్సర్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ ప్రభావాల‌ను కూడా కలిగి ఉంటాయి. అందువ‌ల్ల రోగాల బారి నుంచి మ‌న‌ల్ని మ‌నం ర‌క్షించుకోవ‌చ్చు.

Lemon Leaves amazing benefits how to use them
Lemon Leaves

నిమ్మ ఆకులలో ఉండే సిట్రిక్ యాసిడ్ కిడ్నీల‌లో రాళ్లు ఏర్పడకుండా నిరోధిస్తుంది. మైగ్రేన్‌ తలనొప్పితో బాధపడేవారికి నిమ్మ ఆకులు మేలు చేస్తాయి. నిజానికి నిమ్మ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. శరీర ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడం ద్వారా మైగ్రేన్ సమస్యను తగ్గించడానికి సహాయపడుతుంది. మైగ్రేన్, మానసిక వ్యాధుల నుండి ఉపశమనం పొందడానికి నిమ్మ ఆకుల వాసన చూస్తే తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. నిద్రలేమి సమస్యతో బాధపడేవారికి నిమ్మ ఆకులు సహాయపడతాయి. నిమ్మ ఆకులలో ఉండే సిట్రిక్ యాసిడ్, ఆల్కలాయిడ్స్ మంచి నిద్రకు సహాయపడతాయి.

బరువు తగ్గే ప్రణాళికలో ఉన్నవారికి నిమ్మ ఆకులు బాగా సహాయపడతాయి. నిమ్మ ఆకుల నుండి తయారైన జ్యూస్‌లో పెక్టిన్ అనే కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది బరువును తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. నిమ్మ ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని తాగాలి. నిమ్మ ఆకుల్లో క్రిమిసంహారక గుణాలు ఉండ‌డం వలన కడుపులోని నులిపురుగులను నివారిస్తాయి. నిమ్మ ఆకు రసంలో తేనె కలిపి తీసుకోవాలి. దీంతో ఎంతో మేలు జ‌రుగుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment