వీడియో వైరల్: టూరిస్ట్ ప్లేస్ కి వెళ్తున్నారా.. అయితే ఈ వీడియో తప్పక చూడాల్సిందే!

June 28, 2021 3:54 PM

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో పాటు పలు రాష్ట్రాలలో లాక్ డౌన్ ఆంక్షలు ఎత్తివేశారు. అదేవిధంగా వాతావరణం కూడా కాస్త చల్లబడటంతో చాలామంది ఏదైనా ప్రాంతాలకు టూర్ వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఈ విధంగా టూర్ ప్లాన్ చేసిన ఓ జంటకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపై టూర్ ప్లాన్ చేసే వాళ్ళు తప్పనిసరిగా ఈ వీడియో చూడాల్సిందే..

ఈ వీడియోలో ఓ జంట రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్‌లో టూరిజం వెళ్లారు. ఈ విధంగా వెళ్లిన ఈ జంట తమ కారును రోడ్డు పక్కన ఆపి పచ్చని వాతావరణంలో సెల్ఫీ తీసుకుంటూ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఈ క్రమంలోనే అటుగా వెళ్తున్న కొందరు యువకులు వారి వాహనాలను పక్కగా ఆపి ఆ జంట వద్దకు చేరుకున్నారు.అయితే అక్కడికి వెళ్ళిన యువకులు కత్తులు చూపెడుతూ వారి వద్ద ఏ వస్తువులు అయితే ఉన్నాయో అవన్నీ ఇవ్వాల్సిందిగా కోరారు. వారి దగ్గర ఏమీ లేవని చెప్పడంతో వారు కారు తాళాలు తీసుకుని కారులో విలువైన వస్తువుల కోసం వెతికారు.

కారులో ఏమీ లేక పోవడంతో వారి ఒంటిపై ఉన్న గొలుసులు, ఉంగరాలు తీసుకువెళ్లారు. అదేవిధంగా కారు తాళాలు కూడా లాక్కున్నారు. కనీసం కారు తాళాలు అయిన ఇవ్వమని సదరు మహిళ అడిగినప్పటికీ ఆ యువకులు కారు తాళాలు ఇవ్వకుండా వెళ్లారు. అయితే ఈ తతంగం మొత్తం మహిళ వీడియో చిత్రీకరించినా యువకులు ఏ మాత్రం భయపడకుండా వారి పై ఈ విధంగా దోపిడీకి పాల్పడ్డారు. ప్రస్తుతం ఈ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment