Buttermilk : రోజూ ఒక గ్లాస్ మ‌జ్జిగ‌ను త‌ప్ప‌క తాగాల్సిందే.. ఎందుకో తెలుసా..?

February 27, 2023 10:26 AM

Buttermilk : ప్ర‌తి ఏడాది లాగానే ఈ సారి కూడా చ‌లికాలం ముగిసింది. ఎండ‌లు అప్పుడే విజృంభిస్తున్నాయి. ఇక రానున్న నెల‌ల్లో వేడి మ‌రింత పెర‌గ‌నుంది. దీంతో వేస‌వి తాపం మొద‌ల‌వుతుంది. ప్ర‌జ‌లు ఇప్పుడే శ‌రీరాన్ని చ‌ల్ల‌బ‌రుచుకునే మార్గాల‌ను అనుస‌రిస్తున్నారు. అందులో భాగంగానే ర‌క‌ర‌కాల పానీయాల‌ను సేవిస్తున్నారు. ఇక వేస‌విలో చాలా మంది తాగే పానీయాల్లో మ‌జ్జిగ కూడా ఒక‌టి. కానీ దీన్ని ఏ సీజ‌న్‌లో అయినా స‌రే రోజూ తాగ‌వ‌చ్చు. రోజూ ఒక గ్లాస్ మ‌జ్జిగ‌ను సేవించ‌డం వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

మజ్జిగలో నిమ్మరసం కలుపుకొని తాగితే ఎండదెబ్బ తాకే ప్రమాదం ఉండదు. దాంతో పాటు వేసవి తాపం కూడా తీరుతుంది. డీహైడ్రేషన్ కు గురికాకుండా ఉంటారు. మజ్జిగలో ప్రొటీన్స్, మినరల్స్ ఉంటాయి. ఇవి చాలా ఆరోగ్య సమస్యలను దూరం చేస్తాయి. క‌నుక ఈ సీజ‌న్‌లోనే కాదు.. ఎప్పుడైనా స‌రే రోజూ ఒక గ్లాస్ మ‌జ్జిగ‌ను తాగాల్సిందే.

drink daily one glass of Buttermilk for these benefits
Buttermilk

అంతే కాదు.. కాల్షియం లోపంతో బాధ పడేవాళ్లు మజ్జిగను తాగితే వాళ్ల ఎముకలు, దంతాలు కూడా దృఢపడతాయి. రోజూ మజ్జిగను తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసుకోవ‌చ్చు. అలాగే గ్యాస్, అజీర్తి సమస్యలతో బాధపడేవాళ్లు కూడా మజ్జిగను రోజూ తాగొచ్చు. దీంతో పొట్టంతా ఎలాంటి అల‌జ‌డి లేకుండా ఉంటుంది. క‌డుపులో మంట కూడా త‌గ్గుతుంది.

ఎండాకాలం చాలామందికి వేడి చేస్తుంది. ఆ వేడిని తగ్గించుకోవడానికి కూడా మజ్జిగను తాగొచ్చు. అందుకే.. మిట్టమధ్యాహ్నం వాతావరణం వేడిగా ఉన్నప్పుడు మజ్జిగ తాగితే కడుపు చల్లగా ఉంటుంది. క‌నుక మ‌జ్జిగ‌ను అంత తేలిగ్గా తీసుకోకండి. దీన్ని రోజూ ఒక గ్లాస్ చొప్పున తాగితే ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment