Oosaravelli Movie : ఎన్‌టీఆర్ ఊస‌ర‌వెల్లి మూవీ ఫ్లాప్ అయింది అందుకేనా..?

February 22, 2023 10:00 PM

Oosaravelli Movie : జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఊసరవెల్లి మూవీ 2011 అక్టోబర్ 6న రిలీజై యావరేజ్ గా నిలిచింది. అయితే ఈ మూవీ టీవీలో వస్తుంటే.. సినిమా బాగానే ఉంది కదా.. ఎందుకు తేడా కొట్టింది.. అనిపిస్తుంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ తొలివారం భారీ ఓపెనింగ్స్ తెచ్చుకున్నా.. తర్వాత చతికిలబడి యావరేజ్ గా నిలిచింది. శక్తి మూవీ ఫ్లాప్ తర్వాత ఊసరవెల్లి మూవీ జూనియర్ ఎన్టీఆర్, సురేంద్రరెడ్డి కాంబోలో వస్తుండడంతో తారక్ ఫాన్స్ కసితో ఉన్నారు. కానీ వాళ్ళ అంచనాలు తలకిందులు అయ్యాయి. నిజానికి కిక్ మూవీ తర్వాత సురేంద్రరెడ్డి తీస్తున్న మూవీ కావ‌డంతో తారక్ స్టైలిష్ నెస్, ఆకట్టుకునే సాంగ్స్, ట్రైలర్ అన్నీ చూశాక అంచనాలు బాగా పెరిగాయి.

టోటల్ గా రూ.27.50 కోట్ల షేర్ కలెక్ట్ చేసి బిలో యావరేజ్ మూవీ అయింది. రూ.25 కోట్లతో తీసిన ఈ సినిమా రూ.10 కోట్ల టేబుల్ ప్రాఫిట్ తో రూ.35 కోట్లకు అమ్ముడైంది. అందులో 80 శాతం మాత్రమే రాబట్టింది. తారక్ నటన, తమన్నా గ్లామర్, జయప్రకాశ్ రెడ్డి గ్యాంగ్ హాస్యం, దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఇక స్క్రీన్ ప్లే చెప్పక్కర్లేదు. రిపీట్ ఆడియన్స్ రావాలి. కానీ టైటిల్ ఊసరవెల్లి అని పెట్టడం, మొదటి భాగంలో ఎన్టీఆర్ నటన హైలెట్ గా ఉన్నా, సెకండాఫ్ లో ఎన్టీఆర్ కి సంబంధం లేకుండా హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ నడవడం, తారక్ కనిపించకుండా ఆ ఎపిసోడ్ నడవడం మైనస్ అయింది.

Oosaravelli Movie why it is flop what are the reasons
Oosaravelli Movie

హీరోకి ఆశయం లేకుండా.. హీరోయిన్ ఆశయమే తన లక్ష్యంగా కథనం ఉండడం మైనస్ పాయింట్. పగ, ప్రతీకారం ఒకరిదే అవ్వాలని పరుచూరి బ్రదర్స్ చెప్పారు. అప్పుడే హీరో ఎమోషన్స్ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతాయి. పగ తీర్చుకోవడం, హీరోయిన్ ని విలన్స్ నుంచి కాపాడ‌డం అనే కాన్సెప్ట్ అయితే సినిమా వేరే రేంజ్ లో ఉండేది. మొదటి భాగం వినోదంగా సాగి సెకండాఫ్ సీరియస్ లో నడవడం మరో మైనస్. అందుకే క్లైమాక్స్ లో ఏదో కోల్పోయామన్న భావన ఫ్యాన్స్ లో ఏర్పడింది. అప్పటి వరకూ తారక్ ని చూసిన తీరు వేరు. ఈ సినిమాలో తీరు వేరు. దీన్ని ఫాలో అవ్వడానికి ఫ్యాన్స్ కి సమయం పట్టింది. అందుకే టీవీల్లో చూశాక సూపర్ మూవీ అంటున్నారు. ఇక దూకుడు మూవీ రెండు వారాల ముందు వచ్చి మంచి దూకుడు మీద సాగిపోయింది. మిక్స్ డ్ టాక్ రావడంతో ఊసరవెల్లి దెబ్బతింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment