రూ.6799కే రియ‌ల్‌మి కొత్త ఫోన్‌.. ఫీచ‌ర్లు ఎలా ఉన్నాయంటే..?

June 26, 2021 4:10 PM

మొబైల్స్ త‌యారీదారు రియ‌ల్‌మి కొత్త‌గా సి11 (2021) ఫోన్‌ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. ఇందులో ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో 6.5 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. యూనిసోక్ ఎస్‌సీ9863ఎ ఆక్టాకోర్‌ ప్రాసెస‌ర్‌ను అమర్చారు. 2 జీబీ ర్యామ్ ల‌భిస్తుంది. ఆండ్రాయిడ్ 11 గో ఎడిష‌న్‌ను అందిస్తున్నారు.

realme c11 2021 smart phone launched

ఈ ఫోన్‌లో వెనుక వైపు 8 మెగాపిక్స‌ల్ కెమెరా ఉండ‌గా, ముందు వైపు 5 మెగాపిక్స‌ల్ కెమెరా ఉంది. ఈ ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీని ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌లో 32 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ ల‌భిస్తుంది. 256 జీబీ వ‌ర‌కు మెమొరీని పెంచుకోవ‌చ్చు. డ్యుయ‌ల్ సిమ్ వేసుకోవ‌చ్చు.

డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2 వంటి ఇత‌ర ఫీచ‌ర్లు ఈ ఫోన్‌లో ల‌భిస్తున్నాయి. ఈ ఫోన్‌కు ఫాస్ట్ చార్జింగ్ స‌పోర్ట్‌ను అందిస్తున్నారు.

రియ‌ల్‌మి సి11 2021 స్మార్ట్ ఫోన్ ధ‌ర రూ.6,999 ఉండ‌గా, దీన్ని లాంచింగ్ ఆఫ‌ర్ కింద రూ.6799కే కొనుగోలు చేయ‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment