ఆ బాధను ఎప్పటికీ జయించ లేవు.. అదొక జ్ఞాపకం మాత్రమే.. షారుక్ సంచలన వ్యాఖ్యలు..

June 27, 2021 8:48 PM

బాలీవుడ్ బాద్ షా గా పేరు సంపాదించుకున్న నటుడు షారుక్ ఖాన్  ‘దివానా’చిత్రం ద్వారా వెండితెర అరంగేట్రం చేశారు.ఈ సినిమా తర్వాత షారుఖ్ ఖాన్ విజయవంతమైన సినిమాల్లో నటిస్తూ బాలీవుడ్ స్టార్ హీరోగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలోనే షారుక్ నటించిన ‘దివానా’చిత్రం విడుదలయ్యి శుక్రవారంతో 29 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. ఈ సందర్భంగా హీరో షారుక్ ఖాన్ సరదాగా అభిమానులతో ముచ్చటించారు.

సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించిన షారుక్ ఖాన్ అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు ఎంతో సరదాగా సమాధానాలు తెలియజేశారు. ఈ క్రమంలోనే కొందరు నెటిజన్లు 29 సంవత్సరాలలో మీకు నచ్చినది ఏంటి అని ప్రశ్నించగా… అందుకు షారుక్ సమాధానం చెబుతూ.. నా జీవితంలో ఎంతో విలువైన సంవత్సరాలు ఇవి. వీటి సంఖ్య ఇంకా పెంచుకోవాలని తెలిపారు.

అదేవిధంగా మరొక అభిమాని ప్రేమలో విఫలమైతే దానిని తట్టుకుని ఎలా ముందుకెళ్లాలి అని ప్రశ్నించారు. అందుకు సమాధానంగా షారుక్ ఆ బాధను ఎప్పటికీ నువ్వు జయించ లేవు… దానిని జ్ఞాపకంగా మాత్రమే మిగుల్చుకోవాలంతే. బాధ నుంచి మరింత బలంగా మారడం ఎలాగో నేర్చుకోవాలని తెలిపారు. 2020 సంవత్సరం ఎలా గడిపారు అని ప్రశ్నించగా.. తక్కువ పని చేసి నా కుటుంబంతో ఎక్కువ గడిపాను అంటూ సరదాగా అభిమానులతో ముచ్చటించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment