Sudigali Sudheer Gaalodu : సుడిగాలి సుధీర్ గాలోడు మూవీ ఓటీటీలో.. ఎందులో అంటే..?

February 13, 2023 9:53 AM

Sudigali Sudheer Gaalodu : జ‌బ‌ర్ధ‌స్త్ షోతో మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించుకున్న సుడిగాలి సుధీర్ సినిమాల్లో కూడా స‌త్తా చాటుతున్నాడు. అతడు.. ఎన్నో చిత్రాల్లో మంచి పాత్రలు చేశాడు. ఆ తర్వాత హీరోగానూ మారి కొన్ని సినిమాలు చేయ‌గా, అతడికి నిరాశే ఎదురైంది. ఇలాంటి పరిస్థితుల్లోనే గత ఏడాది సుడిగాలి సుధీర్ ‘గాలోడు’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ కొట్టారు. ఈ చిత్రాన్ని గత ఏడాది నవంబర్ 18వ తేదీన ఎంతో గ్రాండ్‌గా విడుదల చేశారు. దర్శక నిర్మాతల నమ్మకాన్ని నిలబెడుతూ ఈ చిత్రానికి మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ ద‌క్కించుకోవ‌డంతో పాటు అత్యధిక కలెక్షన్లను సాధించింది.

ఫుల్ రన్‌లో గాలోడు చిత్రం రూ. 9.91 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 5.35 కోట్లు షేర్‌ కలెక్ట్ చేసింది. తద్వారా రూ. 2.35 కోట్లు లాభాలను అందుకుని సత్తా చాటుకుంది అయితే ‘గాలోడు’ మూవీని అనుకున్న సమయానికి కంటే ముందుగానే డిజిటల్ స్ట్రీమింగ్ చేస్తారని జోరుగా ప్రచారం జరిగింది కానీ, మూవీని విడుదలైన మూడు నెలలకు అంటే ఫిబ్రవరి 17వ తేదీ నుంచే ఆహా సంస్థలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ప్రకటనను సదరు సంస్థ అధికారికంగా వదిలింది. దీంతో థియేటర్లలో ఈ చిత్రాన్ని మిస్ అయిన ప్రేక్షకులంతా ఆహాలో దీన్ని చూసేందుకు ఆసక్తిని చూపుతున్నారు.

Sudigali Sudheer Gaalodu movie to stream on OTT
Sudigali Sudheer Gaalodu

బుల్లితెర సెన్సేషన్ సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన ‘గాలోడు’ మూవీని రాజశేఖర్ రెడ్డి పులిచెర్ల తెరకెక్కించ‌గా, ఈ చిత్రాన్ని సంస్కృతి ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆయనే స్వయంగా నిర్మించారు. ఈ సినిమాలో గెహనా సిప్పీ హీరోయిన్‌గా నటించింది. భీమ్స్ ఈ చిత్రానికి సంగీతాన్ని ఇచ్చాడు. సప్తగిరి, శకలక శంకర్, పృథ్వీ, సత్యకృష్ణలు ఇందులో కీలక పాత్రలు పోషించారు . సుదీర్ఘ కాలంగా టెలివిజన్ రంగంలో తనదైన రీతిలో హవాను చూపిస్తున్న సుధీర్ రానున్న రోజుల‌లో మ‌రిన్ని మంచి చిత్రాల‌తో అల‌రించాల‌ని అనుకుంటున్నాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment