Ashu Reddy : త‌న బాడీలో ఆ పార్ట్ అంటే త‌న‌కు చాలా ఇష్ట‌మ‌ట‌.. అషు రెడ్డి కామెంట్స్ వైర‌ల్‌..

February 9, 2023 2:01 PM

Ashu Reddy : జూనియ‌ర్ స‌మంత‌గా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన అషూ రెడ్డి బోల్డ్ కామెంట్స్‌తో నిత్యం వార్త‌ల‌లో నిలుస్తూ ఉంటుంది. ఈ అమ్మ‌డు ఆర్జీవిని త‌న కాళ్ల దగ్గ‌ర కూర్చొపెట్టిందంటే అషూ రెడ్డి హ‌వా ఎలా ఉందో చెప్పొచ్చు. సోష‌ల్ మీడియాలోను, బ‌య‌ట ఎప్పుడు కుర్రాళ్ల‌ని ఉడికించేలా త‌న అందాల ఆర‌బోత‌తో ర‌చ్చ చేస్తుంటుంది. తాజాగా అషూ “నా బ్యాక్ అంటే జనానికి ఇష్టం.. అందుకే నా వెనుక మాట్లాడతారు” అంటూ ఓ క్యాప్షన్ పెట్టి తన ఫొటోను షేర్ చేసింది అషూ. ఇది చూసిన నెటిజన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు.

“ఆర్‌జీవి ఎపిసోడ్ తర్వాతే అషూ ఇలా అయిపోయింది, నీకు ఏమైంది అషూ, ఆర్‌జీవి నిన్ను మార్చేశాడు, ఎందుకు కావాలని ట్రోలింగ్‌కు మేటర్ ఇస్తాం” అంటూ ఫాలోవర్లు కామెంట్లు కురిపిస్తున్నారు. ఎన్ని ట్రోల్స్ వ‌చ్చినా స‌రే అషూ మాత్రం త‌గ్గేదే లే అన్న‌ట్టు కాంట్ర‌వ‌ర్సీలో ఇరుక్కుంటూనే ఉంది. ప్పుడూ ట్రావెలింగ్ చేస్తూనే ఉండే ఈ ముద్దుగుమ్మ.. న్యూయార్క్‌ నుంచి వైజాగ్ వరకు చక్క‌ర్లు కొడుతూ వాటికి సంబంధించి పోస్ట్‌లు పెడుతుంది. ప్రస్తుతం సినిమాలపై కాన్సట్రేషన్ చేస్తుంది అషూ రెడ్డి. రీసెంట్‌గా ‘పద్మవ్యూహం చక్రదరికే తెలుసు’ అనే సినిమాలో పద్మగా నటిస్తోంది అషూ.

Ashu Reddy interesting comments netizen surprised
Ashu Reddy

బీబీ జోడి అనే డ్యాన్స్‌షోలో కూడా మెరిసిన అషూ.. అక్కడి నుంచి మధ్యలోనే డ్రాప్ అయింది. ఇందులో బిగ్‌బాస్ ఫేమ్ మెహబూబ్‌తో జోడి కట్టిన అషూ.. తర్వాత షో నుంచి వచ్చేసింది. ఏ మాస్టర్ పీస్ అనే చిత్రంలోనూ కనిపించబోతోంది. ఈ సినిమాలో ఆద్య అనే క్యారెక్టర్‌లో నటిస్తోంది. ఏదేమైన అషూ రెడ్డి త‌న క్రేజ్‌ని ఎలా వాడుకోవాలో తెలుసు. దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌బెట్టుకోవాల‌ని అనుకుంటున్న ఈ ముద్దుగుమ్మ రానున్న రోజుల‌లో స్టార్ హీరోయిన్‌గా మారాల‌ని గ‌ట్టిగా ప్ర‌య‌త్నాలు అయితే చేస్తుంది. ఎంత‌వ‌ర‌కు స‌క్సెస్ అవుతుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now