Sai Dharam Tej : ఫ్యాన్స్‌కు సీరియ‌స్ వార్నింగ్ ఇచ్చిన సాయి ధ‌ర‌మ్ తేజ్‌.. ఏమ‌న్నాడంటే..?

February 8, 2023 5:17 PM

Sai Dharam Tej : మెగా హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ తాజాగా ‘వినరో భాగ్యము విష్ణు కథ’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కార్య‌క్ర‌మానికి హాజ‌రు కావ‌డ‌మే కాక ఆ ఈవెంట్‌లో సంద‌డి చేశారు. వేదిక‌పై మాట్లాడుతుండ‌గా, పెళ్లెప్పుడు అని అభిమానులు ప్ర‌శ్నించ‌గా, దానికి తేజ్ ఊహించ‌ని స‌మాధానం చెప్పారు. మీరు ఎప్పుడయితే అమ్మాయిలను గౌరవిస్తారో అప్పుడు అని అన్నారు. అది మీవల్ల అవుతుందా?’ అని తేజూ ప్రశ్నించ‌గా, వెంటనే ‘ఊ’ అంటూ అవుతుందని అభిమానులు సమాధానం ఇచ్చారు. ‘అవుతుందా? ఏమవుతుంది?’ అని తేజూ మళ్లీ అడ‌గ‌డంతో ఆడియన్స్ నుంచి ఒకరు ‘పెళ్లి’ అని సమాధానం ఇచ్చారు.

‘పెళ్లవదురా.. ముందు మీరు గౌరవించడం నేర్చుకోండి. పెళ్లెప్పుడో అయిపోయింది. నాలుగుసార్లు అయిపోయింది పెళ్లి’ అంటూ మళ్లీ చ‌మ‌క్కులు విసిరారు తేజూ. ఇంకా ఆడియన్స్ నుంచి ఏవో ప్రశ్నలు వస్తుంటే.. ‘ఇప్పటి వరకు ఈ ట్రైలర్‌లో ఉన్న వివాదాలు చాలు. దాన్ని మించి వద్దు’ అని అక్కడితో ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఒక మ‌హిళా అభిమాని సెల్ఫీ అడ‌గ‌గా, సారీ అమ్మా నాకు పెళ్లి అయిపోయిందంటూ న‌వ్వించారు. సాయిధరమ్ తేజ్ స్పీచ్ మొదలుపెట్టినప్పుడు.. ‘అన్న ఐ లవ్ యు’ అని ఒక అభిమాని అన‌డంతో.. ‘ఆ పదం నాకు అస్సలు అచ్చిరాలేదండి.. వద్దురా అబ్బాయిలు ప్లీజ్’ అని నవ్వుతూ రిప్లై ఇచ్చారు సాయిధరమ్ తేజ్.

Sai Dharam Tej given warning to his fans
Sai Dharam Tej

మెగా మేనల్లుడుగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు. సినిమా హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోయాడు. అలా తన సినిమాలతో మినిమం గ్యారెంటీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు సాయి ధరమ్ తేజ్. యాక్సిడెంట్ త‌ర్వాత సినిమాల స్పీడ్ కొంత త‌గ్గించిన తేజ్ త్వ‌ర‌లో ఓ చిత్రంతో ప‌ల‌క‌రించ‌నున్నాడు. ఆ సినిమా కోసం ఫ్యాన్స్ ఆస‌క్తగా ఎదురు చూస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment