అలేఖ్య రెడ్డి ఎవ‌రో తెలుసా.. ఆమె బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

February 8, 2023 8:26 AM

నందమూరి కుటుంబం నుంచి ఒక్క విజయం కూడా అందుకోని ఏకైక హీరో తారకరత్న అని చెప్పాలి. నందమూరి మోహన కృష్ణ తనయుడు అయిన‌ ఈయన… జ‌న‌వ‌రి 27న ఈయన లోకేష్ యువగళం పాదయాత్రలో పాల్గొని గుండెపోటుతో హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. మెరుగైన వైద్యం కోసం విదేశాల‌కి కూడా త‌ర‌లించార‌ని తెలుస్తుంది. ఈ నందమూరి హీరో ప్రాణాల కోసం పోరాడుతూనే ఉన్నాడు. తారకరత్న ఆస్పత్రిలో ఉండగానే అతడి భార్య అలేఖ్య రెడ్డి ఫ్యామిలీ, పర్సనల్ సీక్రెట్స్ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తున్నాయి.

అలేఖ్య రెడ్డి.. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరదలి కూతురు కావడంతో పాటు తారకరత్నను ప్రేమ వివాహం చేసుకోవడంతో ఆమెకి సంబంధించిన విష‌యాలు నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. తారకరత్నను వివాహం చేసుకోడానికి ముందే అలేఖ్య రెడ్డికి పెళ్లి జరిగింది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి కుమారుడైన సందీప్ రెడ్డిని ఆమె వివాహం చేసుకోగా, అతడితో దాదాపు నాలుగేళ్ల పాటు వైవాహిక జీవితాన్ని గడిపిన తర్వాత మనస్పర్థలు వచ్చాయి. దీంతో సందీప్ రెడ్డికి అలేఖ్య విడాకులు ఇచ్చింది.విడాకులు అయిన తర్వాత కొన్ని చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా వర్క్ చేసింది అలేఖ్య . ఈ క్రమంలోనే నందమూరి తారకరత్న నటించిన ‘నందీశ్వరుడు’ సినిమాకు కూడా పని చేసింది. ఆ సమయంలోనే అలేఖ్య – తారకరత్న మధ్య స్నేహం పెరిగింది.

interesting facts about taraka ratna wife alekya reddy

ఓ సారి తార‌క‌ర‌త్న అలేఖ్య‌కి ప్ర‌పోజ్ చేయ‌గా, తాను త‌న ఇంట్లో అడ‌గ‌మ‌ని చెప్పింద‌ట‌. సినిమా బ్యాగ్రౌండ్ ఉండడం వల్ల అలేఖ్య ఫ్యామిలీ తార‌క‌ర‌త్న‌ని ఒప్పుకోలేదు. అంతకు ముందే విడాకులు తీసుకోవడం వల్ల తారకరత్న కుటుంబం వీళ్లిద్దరి పెళ్లికి అడ్డుగా నిలిచినట్లు తెలిసింది. ఇరు కుటుంబాల సభ్యులు ఒప్పుకోకపోయినా అలేఖ్య రెడ్డి – నందమూరి తారకరత్న 2012 ఆగష్టు 2న సంఘీ టెంపుల్‌లో సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. వీళ్ల వైవాహిక జీవితం అన్యోన్యంగా సాగుతూ ఓ పాపకు జన్మనిచ్చారు. తార‌క‌ర‌త్న బ‌ర్త్ డేకి బాల‌య్య‌ని ఇన్వైట్ చేయ‌గా, ఆయ‌న‌తో పాటు నారా లోకేష్ రావ‌డం అలా నెమ్మ‌దిగా నంద‌మూరి ఫ్యామిలీకి ద‌గ్గ‌ర కావ‌డం జ‌రిగింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment