Samantha Ring : స‌మంతకి కూడా సెంటిమెంట్స్ ఉన్నాయా.. అందుకే రంగు రాళ్లు ధ‌రిస్తుందా..?

February 3, 2023 3:30 PM

Samantha Ring : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఫ్యామిలీ మ్యాన్‌ 2 వెబ్ సిరీస్ తో బాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన సమంత పుష్ప సినిమాలో ప్రత్యేక పాటతో హిందీలో చాలా గుర్తింపు తెచ్చుకుంది. ఫ్యామిలీ మ్యాన్ తర్వాత హిందీలో ఆమె మరో వెబ్ సిరీస్‌ కు ఓకే చెప్పింది. అమెరికన్ వెబ్‌ సిరీస్‌ ‘సిటాడెల్’కు హిందీ రీమేక్ కాగా, హిందీలోనూ సిటాడెల్ అనే పేరునే వస్తోంది. వరుణ్ ధావన్ హీరోగా నటిస్తుండగా, ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ సృష్టికర్తలు రాజ్ అండ్ డీకే దీన్ని రూపొందిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ వెబ్ సిరీస్ షూటింగ్‌లో బిజీగా ఉంది స‌మంత‌.

అంద‌రు స్టార్స్ మాదిరిగానే స‌మంత‌కి కూడా కొన్ని సెంటిమెంట్స్ ఉన్నాయి. హీరోయిన్లు చాలా వరకు సెంటిమెంట్లను నమ్మరు.కానీ తాజాగా సమంత మాత్రం వీటిని నమ్ముతున్నట్లు తెలిసింది. సమంత ప్రస్తుతం మానసికంగా, వ్యక్తిగతంగా బాధపడుతున్న విష‌యం మ‌న‌కు తెలిసిందే. మ‌యెసైటిస్ అనే వ్యాధి స‌మంత‌కి సోక‌డంతో మొన్నటి వరకు అమెరికాలో కూడా ట్రీట్మెంట్ చేయించుకుంది. అయితే ప్ర‌స్తుతం కోలుకున్న‌ట్టు తెలుస్తుండ‌గా, ఇప్పుడు త‌ను క‌మిట్ అయిన సినిమాల షూటింగ్స్‌లో పాల్గొంటుంది.

Samantha Ring do you know about it
Samantha Ring

ఇటీవ‌ల స‌మంత ఓ ప్రమోషన్స్ లో పాల్గొన్నప్పుడు తన చేతికి ఉన్న మూడు రంగురాళ్లను జర్నలిస్టులు పసిగట్టారు. దీంతో ఆమె ఉంగరాల వైపు కూడా ఫోటోగ్రాఫర్లు క్లిక్ మనిపించారు.అయితే ఇదివరకు ఎప్పుడు సమంత చేతికి అన్ని ఉంగరాలు లేవని ఇప్పుడు అన్ని ఉంగరాలు పెట్టుకోవడంతో తను కూడా ఏదైనా సెంటిమెంట్ ను ఫాలో అవుతుందా అని అనుమానాలు వచ్చాయి. హిందూ సాంస్కృతి ప్రకారం అవి కొన్ని జాతకాల ప్రకారం అదృష్టం ప్రకారం ధరించినట్లు తెలిసింది. అయితే ఆమె ధరించిన ఉంగరంలో ఒకటి కనకపుష్యరాగం అనే ఉంగరం ఉంది. ఇక ఈ ఉంగరం సంపద, ఆరోగ్యం, కీర్తి, ఫలవంతమైన సంబంధాలను ఇస్తుందని కొన్ని శాస్త్రాలు చెబుతున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now