Samantha : విషమించిన సమంత ఆరోగ్య పరిస్థితి.. మెరుగైన వైద్యం కోసం వేరే దేశానికి తరలింపు..?

November 30, 2022 12:54 PM

Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత కొన్ని రోజులుగా మయోసైటిసిస్ అనే తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం అందరికి తెలిసిందే. భారీగా ఎక్సర్ సైజులు చేసి కండరాలపై బాగా ఒత్తిడి పెరిగి, శారీరక ఒత్తిడికి గురైన సమంతకు ఈ మయోసైటిస్ అనే అరుదైన చికిత్సకు అందుబాటులో లేని వ్యాధి సోకినట్టు సమాచారం. మయోసైటిసిస్ సమస్యతో బాధపడుతున్న సమంత ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

అయితే సమంత మయోసైటిసిస్ సోకిన వెంటనే అమెరికాలో కొద్ది రోజులు పాటు చికిత్స తీసుకున్నారు. మయోసైటిసిస్ అనే అరుదైన వ్యాధికి చికిత్స కోసం అమెరికా వెళ్లి వచ్చి ట్రీట్ మెంట్ తీసుకున్న సమంత హైదరాబాద్ లోని ఆస్పత్రిలో ఉంటూ చికిత్స కొనసాగిస్తోంది. ఇండియాలో కూడా ఈ వ్యాధికి చికిత్స తీసుకున్న సమంత ఇంగ్లీష్ మందులతో ఈ వ్యాధి నయం కాకపోవడంతో కేరళలో ఆయుర్వేద వైద్యం కూడా ప్రయత్నం చేశారని వార్తలు కూడా వినిపించాయి.

Samantha health condition is not ok went for treatment
Samantha

ప్రస్తుతం సమంత ఆరోగ్య పరిస్థితి చాలా సీరియస్ గా ఉందని, అందుకే మెరుగైన చికిత్స అందుబాటులో ఉన్న దక్షిణ కొరియాకు తరలించినట్టుగా సమాచారం వినిపిస్తుంది. ఇలా మయోసైటీస్ వ్యాధికి చికిత్స తీసుకుంటున్న ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో సమంత ఆరోగ్యం మరింత క్షీణించిందట  ఇక అమెరికాలో కూడా ఈ మయోసైటిస్ వ్యాధికి చికిత్స లేకపోవటంతో సమంత దక్షిణ కొరియా వెళ్లిందని సోషల్ మీడియాలలో వార్తలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఒక్క దక్షిణకొరియాలోనే అత్యంత ఆధునిక, సంప్రదాయ వైద్యంలో కండరాలక్షీణతకు చికిత్స ఉందని తెలియడంతో సమంత అక్కడికి వెళ్లినట్టు సమాచారం. అయితే  సమంత దక్షిణ కొరియా వెళ్లిందన్న వార్తలపై ఆమె కానీ, ఆమె సన్నిహితులు కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. అధికారికంగా ఎటువంటి విషయాన్ని బయటపెట్టలేదు. ఈ వార్తలపై నిజమెంత అనేది సమంత ఇచ్చే సమాచారం పై ఆధారపడి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment