Garlic : వెల్లుల్లిని రోజూ ఇలా తీసుకుంటే.. ఏ రోగ‌మైనా స‌రే మీ ద‌రి చేర‌దు..

November 26, 2022 9:33 PM

Garlic : మన పూర్వీకులు వేల సంవత్సరాల నుండి వెల్లుల్లిని ఆహారంలో ఉపయోగిస్తున్నారు. ఆయుర్వేదంలో చరక మరియు సుశ్రుతతో పాటు, క్రీ.శ.650లో వైద్య వాగ్భట తన అష్టాంగ హృదయ గ్రంథంలో వెల్లుల్లి లక్షణాల గురించి చాలా రాశారు. నేడు వైద్యులు గుండె సంబంధిత సమస్యల విషయంలో వెల్లుల్లిని వాడాలని కూడా సిఫార్సు చేస్తున్నారు. ఎందుకంటే వెల్లుల్లి రక్తాన్ని పల్చగా ఉంచడంలో సహాయపడుతుంది. వెల్లుల్లిని తీసుకోవడం వల్ల కూడా చలికాలంలో శరీరం వెచ్చగా ఉంటుంది. ఇదే కారణం వెల్లుల్లిలో ఉండే ఘాటైన వాసన వల్ల ఇష్టం లేని వారు కూడా శీతాకాలం రాగానే వెల్లుల్లిని తీసుకోవడం మొదలుపెడతారు. వెల్లుల్లి పరగడుపునే తీసుకోవడం వల్ల మనకి ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

అసలు ముందుగా వెల్లుల్లి ఏ విధంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనాలు చేకూరుస్తుందో తెలుసుకుందాం. వెల్లుల్లిని సన్నగా తురిమి తేనెలో కలిపాలి. దీన్ని ప్రతిరోజు ఉదయం లేవగానే కాలకృత్యాలు తీర్చుకున్న తరువాత ఒక స్పూన్ మోతాదు తీసుకోవాలి. అనవసరంగా ఎక్కువ టాబ్లెట్లు మింగుతూ ఆరోగ్యం కోసం పాకులాడే బదులు ప్రతిరోజు ఉదయం ఈ చిన్న పని చేయండి చాలు. తేనె మరియు వెల్లుల్లి మిశ్రమం అనేక సమస్యలను దూరం చేస్తుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ బయోటిక్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫెక్షన్ గుణాలు ఉండటం వల్ల జలుబు, దగ్గు వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా వెల్లుల్లిలో అల్లిసిన్ మరియు ఫైబర్ లక్షణాలు అధికంగా ఉన్నాయి. ఇది మీ బరువును కూడా నియంత్రించడంలో సహాయపడుతుంది.

take Garlic daily in this way to be healthy
Garlic

జలుబు సమస్య తగ్గాలంటే తేనె, వెల్లుల్లి కలిపి తీసుకోవాలి. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు గొంతు వాపు మరియు నొప్పులను తగ్గిస్తాయి. దీనివల్ల పుండ్లు పడడం, కఫం వంటి సమస్యలు తగ్గుతాయి. వెల్లుల్లి మరియు తేనె మిశ్రమాన్ని కలిపి తీసుకోవడం వలన గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. దీని వినియోగం గుండె ధమనులలో పేరుకుపోయిన కొవ్వును తొలగించగలదు. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. గుండెలో రక్త ప్రసరణను మెరుగుపరచడం ద్వారా మీ గుండె ఆరోగ్యం చాలా బాగుంటుంది. వెల్లుల్లి మరియు తేనె మిశ్రమం కడుపు రుగ్మతలను కూడా నయం చేస్తుంది. దీంతో జీర్ణక్రియలో ఆటంకాలు తొలగిపోతాయి. మీరు కడుపు ఇన్ఫెక్షన్‌తో పోరాడుతున్నట్లయితే.. మీ ఆహారంలో వెల్లుల్లి మరియు తేనెను చేర్చుకోండి. అయితే మీరు వెల్లుల్లిని మొదటిసారిగా తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా నిపుణుడిని సంప్రదించండి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment