Pawan Kalyan : పుస్త‌కాలంటే ప‌వ‌న్‌కు ప్రాణం.. అస‌లు ఆయ‌న ఎంత వ‌ర‌కు చ‌దువుకున్నారు..?

November 17, 2022 7:49 AM

Pawan Kalyan : ప‌వ‌ర్ స్టార్ పవ‌న్ క‌ళ్యాణ్ క్రేజ్, ఆయ‌న రేంజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. టాలీవుడ్ స్టార్ హీరోల‌లో ఒక‌రిగా ఉన్న ప‌వ‌న్ ప్ర‌స్తుతం సినిమాలు చేస్తూనే మ‌రోవైపు రాజ‌కీయాల‌పై కూడా దృష్టి సారిస్తున్నారు. పవన్ షూటింగ్స్ మరియు పాలిటిక్స్ లో  ఖాళీ సమయం దొరికితే చాలు ఎక్కువగా పుస్తకాలు చదువుతూ ఉంటారు. ఎక్కువగా పుస్తకాలు చదువుతూ సినిమాలతో పాటు రాజకీయాలను కూడా చక్కగా బ్యాలన్స్ చేస్తున్న పవన్ కళ్యాణ్ ఏ విద్యను అభ్యసించారు అనే విషయం తెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు.

అసలు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏం చ‌దువుకున్నాడు.. ఎంత వ‌ర‌కు ఈయ‌న చ‌దువు సాగింది.. ఇలా చాలా ప్ర‌శ్న‌లు ప‌వ‌న్ ఎడ్యుకేష‌న్ మీద ఉన్నాయి. అయితే ప‌వ‌న్ క‌ళ్యాణ్ భాష‌ను చూసిన త‌ర్వాత ఆయ‌న చ‌దువు గురించి ఎవ‌రూ ప్ర‌శ్నించాల్సిన అవ‌స‌రం కూడా రాలేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా అన‌ర్ఘలంగా మాట్లాడ‌గ‌ల‌డు.

Pawan Kalyan likes reading books know his educational qualifications
Pawan Kalyan

ఇక పవన్ కళ్యాణ్ ఏం చదివారు అనే విషయానికి వస్తే.. పవన్ కళ్యాణ్ కొణిదెల వెంకట్రావు, అంజనాదేవిలకు 1972 సెప్టెంబర్ 2న బాపట్లలో జన్మించాడు. పవన్ కళ్యాణ్ నాన్న పోలీస్ శాఖలో హెడ్ కానిస్టేబుల్ గా చేసేవారు. దీంతో తరచూ బదిలీలు జరిగేవి. ఇలా పవన్ విద్యాభాస్యం బాపట్లలో మొదలైంది. ఆ తర్వాత చీరాలలో కొనసాగింది. పవన్ తన ఇంటర్ మీడియట్ ను నెల్లూరులోని వీ.ఆర్.సీ కళాశాలలో పూర్తి చేశాడు. ఆ తర్వాత చదువుల మీద ఆసక్తి లేక డిగ్రీ చేయలేదు. అనంతరం కంప్యూటర్స్ లో డిప్లొమో చేసి చదువులకు శాశ్వతంగా స్వస్తి పలికాడు.

ఖాళీగా ఉన్న పవన్ అటు చదువుకోకుండా ఇటు ఎవ్వరితో కలువకుండా సైలెంట్ గా ఉండడం చూసి అన్న చిరంజీవి 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం చేయించాడు. మెగాస్టార్ సినీ వారసుడిగా  ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కూడా తన సొంత టాలెంట్ తో పవర్ స్టార్ గా, అభిమానులు మా ఆరాధ్య దైవం పవన్ అనే రేంజ్ ఎదిగాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now