Chiranjeevi Old House : కొణిదెల శివశంకర వరప్రసాద్ ని మెగాస్టార్ గా నిలబెట్టిన ఇల్లు ఇదే..!

November 15, 2022 8:13 AM

Chiranjeevi Old House : స్వ‌యంకృషితో టాలీవుడ్ మెగాస్టార్‌గా ఎదిగిన చిరంజీవి ఎందరికో స్పూర్తి. ఇప్ప‌టికీ ఆయ‌న స్పూర్తితో సినిమా ప‌రిశ్ర‌మ‌లోకి చాలా మంది అడుగుపెడుతున్నారు. చిరంజీవి న‌ట‌న‌, ఫైట్స్, డ్యాన్స్ చూసి మురిసిపోని వారు లేరంటే అతిశ‌యోక్తి కాదు.  చిరంజీవి ఎన్నో మైలు రాళ్లను దాటుకొని ఈ స్థాయికి చేరారు. ప్రసుతం మెగా స్టార్ పేరు చెప్పితే ఒక పెద్ద సినీ కుటుంబమే గుర్తుకు వస్తుంది. ప్రస్తుతం చిరంజీవికి పెద్ద పెద్ద బంగ్లాలు, బెంజి కార్లను తమ కుటుంబం మొత్తానికి కల్పించి ఉండవచ్చు. కానీ చిరంజీవి ఈ స్థాయికి రావడానికి చిన్న వయసు నుంచే ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. ఆయన పడిన కష్టాలకు ప్రత్యక్ష నిదర్శనమే ఈ ఇల్లు. ఈ ఇల్లు నెల్లూరు పట్టణంలో నేటికీ కూడా చెక్కు చెదరకుండా ఆనాటి చిరు జ్ఞాపకాలకు సజీవ సాక్షిగా నిలుస్తుంది.

చిరంజీవి తన విద్యాబ్యాసం మొత్తం ఇక్కడే పూర్తి చేసారు. డిగ్రీని పూర్తి చేసే సమయంలో చిరంజీవి తండ్రి కొణెదల వెంకట్రావు నెల్లూరు లో ఎక్సయిజ్ డిపార్ట్ మెంట్ లో సి.ఐ గా పని చేసేవారు . అప్పుడు వెంకట్రావు గారు ఈ ఇంటిలోనే ఉండేవారట. ఇక్కడే చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ పెరిగారు. ఈ ఇంటి నుంచే చిరంజీవి సినీ ప్రయాణం ప్రారంభమయ్యింది. నెల్లూరు నుంచి 176 కిలోమీటర్ల దూరంలో ఉన్న  మద్రాస్ కి అంటే ఇప్పటి చెన్నైకి చిరంజీవి ఈ ఇంటి నుంచే వెళ్లి వస్తూ ఉండేవారట. చిరంజీవి సినిమా ప్రయత్నాలు చేసేందుకు నెల్లూరు నుంచి నేషనల్ హైవే 16 మీదుగా మద్రాస్ కి వెళ్లేవారు.

Chiranjeevi Old House his life changed with this
Chiranjeevi Old House

ఒక్కోసారి తన తండ్రి దగ్గర ఉన్న బులెట్ పై చిరంజీవి మద్రాస్ కి వెళ్లేవారట. ఒక విధంగా చెప్పాలంటే సినిమాలపై చిరుకి ఆసక్తి కలగటానికి ఈ ఇల్లే కారణమని చెప్పవచ్చు. నెల్లూరుకి  మద్రాస్ అత్యంత దగ్గరగా ఉండటంతో ప్రతి పనికి మద్రాస్ కి ఎక్కువగా వెళ్లేవారు. ఆ సమయంలో  సినీ పరిశ్రమ మొత్తం మద్రాస్ లోనే ఉండటంతో ఎక్కువగా సినీ రంగంలో నెల్లూరు వారే స్థిరపడ్డారు. అలాగే చిరంజీవి కూడా ఉద్యోగ ప్రయత్నం కోసం వెళ్లి సినిమాలపై ఆసక్తితో ప్రయత్నాలు మొదలుపెట్టారు. అలా ఆయన సినీ ప్రస్తానని పునాదిరాళ్లు చిత్రంతో మొదలుపెట్టారు. అది ఆ ఇంటికి ఉన్న చరిత్ర.

ఈ ఇంటిలో కొన్ని రోజుల క్రితం వరకు చిరంజీవి బాబాయి ఉండేవారు. ఆయన పిల్లలు విదేశాలలో స్థిరపడటంతో ఆయన కూడా అక్కడకు వెళ్లిపోవటంతో.. ఈ ఇంటిని చిరంజీవి కుటుంబసభ్యులు అమ్మేసారు. ఆ ఇంటిని కొనుగోలు చేసిన నెల్లూరు వాసి రూపురేఖలు మార్చకుండా అలానే ఉంచారు. ఎందుకంటే ఎంతైనా ఒక లెంజెండ్ హీరో నివసించిన ఇల్లు కాబట్టి. ఆ ఇంటిని కొత్తగా కొన్న యజమాని చిరంజీవి మీద అభిమానంతో  అలానే ఉంచేశారు. అలానే ఉంచితేనే  అది చిరంజీవికి ఇచ్చే  గౌరవమని ప్రస్తుత ఇంటి యజమాని భావిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now